చిన్నచిన్నగా ఉండదు.. తీసి అవతల పడేస్తం.. KCR వీడియో వైరల్

KCR : బీఆర్ఎస్ పార్టీలో కనివిని ఎరుగని సంఘటన చోటుచేసుకుంది. కన్న కూతురు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ లపై ఇటీవల కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో గూలాబీ బాస్ ఆగ్రహానికి గురైన ఆమెను పార్టీ నుంచి తీసి పక్కన పెట్టారు కేసీఆర్. దీంతో గతంలో కేసీఆర్ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. పార్టీకి యాంటీగా పోతే ఎంతటివాళ్లనైనా తీసి పారేస్తామని, వాళ్ల ఖర్మ వాళ్లు పోతారని కేసీఆర్ హెచ్చరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైనంపల్లి వ్యవహారంలో కేసీఆర్ మాట్లాడిన వీడియోను ఇప్పుడు కవితతో పోలుస్తూ వైరల్ చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.