IND vs SA : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది, టైటిల్ కోసం ఆతిథ్య భారత్, దక్షిణాఫ్రికా(IND vs SA) జట్లు తలపడుతున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ చూడటానికి మొత్తం క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఉంది. ఫైనల్ కోసం అన్ని టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. టిక్కెట్ల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
భారత జట్టుపై మైండ్ గేమ్స్
ఇదిలా ఉండగా ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు భారత జట్టుపై మైండ్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్టెర్ట్ కీలక కామెంట్స్ చేసింది. గతంలో ఆస్ట్రేలియా ఉపయోగించిన వ్యూహాన్నే భారత జట్టుపై ఇప్పుదు సౌతాఫ్రికా కూడా ప్రయోగిస్తుంది. 2023 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. అప్పుడు భారత్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది.
🚨 #BreakingNews 🚨 ‘Guess That Will Silence Them’: Laura Wolvaardt Channels Pat Cummins’ 2023 Remark Ahead Of Women's World Cup 2025 Final Clash VS India https://t.co/D7uVFEwlfX
Grab #amazon #deals here:
For #USA https://t.co/XSLcMcH5fl
For #INDIA https://t.co/4c1HvUGtfn#T…— Instant News ™ (@InstaBharat) November 2, 2025
అప్పుడు పాట్ కమ్మిన్స్ కూడా ఇలాగే
ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ ఇండియా ఫ్యాన్స్ ను సైలెంట్ చేస్తామని, కప్పు కొడతామని సవాల్ చేశాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్టెర్ట్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ .. “ఈసారి మేము గెలుస్తాం. భారత అభిమానులను సైలెంట్ చేస్తాం” అని చెప్పింది. చూడాలి ఏం జరుగుతుందో చూడాలి.
IND vs SA : దక్షిణాఫ్రికా తొలిసారి, ఇండియా మూడోసారి
సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను 125 పరుగుల తేడాతో ఓడించి దక్షిణాఫ్రికా తొలిసారి మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్‌కు, ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకోవడానికి ఇది వారి మూడవ ప్రయత్నం. మొత్తం మీద ఫైనల్ కు చేరిన రెండు జట్లు బలబలాలు సమానంగా ఉన్నాయి. ఇందులో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది.
Also Read :
