vikarabad : వంట రాదంటూ భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య

Vikarabad

vikarabad :  వంట రాదు.. నా కన్నా తక్కువగా చదువుకున్నావని భర్త వేధించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహ త్య చేసుకుంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం… ధరూర్ మండలంలోని గడ్డమీద గంగారం గ్రామానికి చెందిన గంజి మల్లమ్మ, సాయన్న చిన్న కూతురు శిరీష (21)కు పరిగి మండలం మల్లె మోనిగూడ గ్రామానికి చెందిన శివలింగంతో ఐదు నెలల కిందే వివాహమైంది.

పెళ్లి తర్వాత వంట రాదు, తక్కువగా చదువుకున్నావని శివలింగం వేధించడంతో పాటు ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో కుటుంబ పెద్దలు పలుమార్లు పంచాయితీ నిర్వహించి నచ్చజెప్పారు.ఈ క్రమంలో సోమవారం సైతం శిరీష, శివలింగం గొడవ పడ్డారు.

అనంతరం శివలింగం తన భార్య శిరీషను పుట్టింటి వద్ద విడిచి వెళ్లాడు. మంగళవారం ఉదయం కూలీ పనులకు వెళ్లిన మల్లమ్మ సాయంత్రం తిరిగి వచ్చే సరికి శిరీష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అల్లుడు శివలింగం వేధింపులు తట్టుకోలేకే తన కూతురు శిరీష ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు.

క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 5 ఈజీ టిప్స్ మీ లివర్ డేంజర్‌లో ఉందని చెప్పే 7 లక్షణాలు! బాడీలో నీళ్లు తగ్గాయని చెప్పే 7 వార్నింగ్స్ సంక్రాంతి పుంజులు ‘అఖండ-2’: టికెట్ రేట్లు పెంపు సమంత, రాజ్‌ ఆస్తులెంత? దసరా భామలు సీడ్ సైక్లింగ్‌ ఎలా చేయాలంటే? ఏ చర్మానికి ఏ ఫేస్‌వాష్ వాడాలో తెలుసా? కాళ్లకు పసుపు ఎందుకు రాస్తారంటే..