Tirupati : దిక్కుమాలిన ప్రొఫెసర్ .. పాఠాలు చెప్పురా అంటే పాడు పని చేశాడు!

tirupati

Tirupati : తిరుపతిలో దారుణం జరిగింది. నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ దారుణానికి పాల్పడ్డాడు. యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెను లోబర్చుకొని గర్భిణీని చేశాడు. అయితే ఈ దారుణానికి మరో ప్రొఫెసర్ కూడా సహకరించడం గమనార్హం.

డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఆ విద్యార్థినితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను మరో ప్రొఫెసర్ తన ఫోన్‌లో రికార్డు చేశాడు. అనంతరం వాటిని అడ్డు పెట్టుకుని విద్యార్థినిని బెదిరించడం మొదలు పెట్టాడు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు నేరుగా ఈ ఇద్దరు ప్రొఫెసర్‌లపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు సైతం ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి వెంటనే స్పందించారు.

ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనతో వేధింపులతో తీవ్ర ఆవేదనకు గురైన విద్యార్థిని, తన చదువును మధ్యలోనే ఆపివేసి తన స్వస్థలమైన ఒరిస్సాకు వెళ్ళిపోయింది. అయితే ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం తరుపున కొంతమంది సిబ్బంది డాక్టర్ లక్ష్మణ్ కుమార్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.

పోలీసులు మాత్రం అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయలేదు. బాధిత విద్యార్థిని స్వయంగా వచ్చి ఫిర్యాదు చేయాలని అప్పుడే కేసు నమోదు చేస్తామని తెలిపారు. మొత్తానికి ఈ ఘటన యూనివర్సిటీలో కలకలం రేపింది.