BIG BREAKING : MLA కొడుక్కి డ్రగ్స్ పాజిటివ్!

mla

BIG BREAKING :  గంజాయి తీసుకుంటూ వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి దొరికిపోయారు. సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్టు చేయగా పాజిటివ్ గా తేలింది. దీంతో సుధీర్ రెడ్డిని హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో అదుపులోకి తీసుకున్నారు. సుధీర్‌రెడ్డిని అరెస్టు చేసి డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

కాగా ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి గెలిచారు. డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే కొడుకు దొరికిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.