Karimnagar : కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన కపుల్ సెక్స్ రాకెట్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్బుల్ బిజినెస్‌లో సుమారు 2 కోట్ల రూపాయల వరకు నష్టపోయిన ఒక భర్త, తన భార్యకున్న బలహీనతను పెట్టుబడిగా మార్చుకుని ఈ వికృత వ్యాపారానికి తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు.
మార్బుల్ బిజినెస్లో భారీగా నష్టపోయిన భర్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే అతని భార్య సోషల్ మీడియాకు బానిసైంది. అనుకోకుండా పరిచయమైన కుర్రాడితో వివాహేతర సంబంధం కూడా పెట్టుకుంది. ఆ కుర్రాడు కూడా ఖర్చులకు డబ్బు ఇవ్వడంతో ఆనందంలో మునిగితేలిపోయింది. అయితే అదే డబ్బు పిచ్చితో మరికొందరితో భార్య శృంగారం చేయడం మొదలుపెట్టింది.
దీంతో ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు భర్త. అయితే ఇక్కడే ఓ స్కెచ్ వేశాడు. భార్యను మందలించడం వదిలేసి ఆమె పిచ్చితోనే వ్యాపారం మొదలుపెట్టాడు. ఆమెతోనే వ్యభిచారం చేయిస్తూ భారీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం ‘లల్లీ డింపుల్ క్వీన్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ అకౌంట్‌ను సృష్టించి, సంపన్న కుటుంబాలకు చెందిన యువకులు, ప్రముఖుల పిల్లలు, వీఐపీ నేతలే టార్గెట్‌గా వల విసిరారు.
చాటింగ్ ద్వారా వారిని ఆకర్షించి, ఏకాంతంగా గడిపేందుకు పిలిచి, ఆ సమయంలో భర్త రహస్యంగా వీడియోలు రికార్డ్ చేసేవాడు. గత నాలుగేళ్లలో ఈ దంపతులు సుమారు 1500 మందిని తమ వలలో వేసుకున్నట్లు సమాచారం. రికార్డ్ చేసిన వీడియోలను చూపించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ, పరువు పోతుందనే భయంతో ఉన్న బాధితుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
ప్రస్తుతం ఈ వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ రూరల్ పోలీసులు గత బుధవారం (జనవరి 14) ఈ కిలాడీ దంపతులను అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ జంట అసలు ఊరు మంచిర్యాల అని, గత కొంతకాలంగా కరీంనగర్‌లో ఉంటూ ఈ దందా సాగిస్తున్నారని పోలీసులు నిర్ధారించారు.
