Telangana :పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు ..సర్కార్ ఉత్తర్వులు!

cm revanth reddy

Telangana : దివ్యాంగుల పెళ్లికి రూ.2లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అయితే ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక సాయం భార్య పేరున అందిస్తారు.

ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నా లేదా సాధారణ వ్యక్తులు దివ్యాంగులను పెళ్లి చేసుకున్నా ఈ స్కీమ్ వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం ఇస్తామని సీఎం రేవంత్ ఇటీవల వెల్లడించారు. క్రీడల్లో రాణించినవారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

గతంలో పెళ్లి చేసుకునే జంటలో ఒకరు దివ్యాంగులైతే రూ. 1 లక్ష ఇచ్చేవారు. ఇప్పుడు పెళ్లి చేసుకునే వధూవరులిద్దరూ దివ్యాంగులైతే ఆ మొత్తాన్ని రూ. 2 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారాఅధికారికంగా జీవో (G.O.Ms.No.1) విడుదలైంది.

ఈ స్కీమ్ కు దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. చట్టబద్ధమైన వివాహ వయస్సు (అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు) నిండి ఉండాలి. కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.

  • అర్హులైన జంటలు వివాహం జరిగిన ఏడాది లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది:
  • తెలంగాణ ePASS పోర్టల్‌లోకి వెళ్లాలి.
  • అక్కడ ఉన్న ‘PwD Welfare’ సెక్షన్‌ను ఎంచుకోవాలి.
  • అవసరమైన పత్రాలను (సదరం సర్టిఫికేట్, వివాహ ధృవీకరణ పత్రం, ఆధార్) జతచేసి ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.

దరఖాస్తుకు కావల్సినవి

  • పెళ్లి పత్రిక
    దంపతుల ఆధార్ కార్డులు.
    సదరం వైకల్యం సర్టిఫికెట్.
    నివాస ధృవీకరణ పత్రం.
    ఉమ్మడి ఫోటో