IPS ; తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
గజారావు భూపాల్ (ఐజీ), అభిషేక్ మొహంతి (విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఐజీ), భాస్కరన్ (ఇంటెలిజెన్స్ డీఐజీ), చందనా దీప్తి (ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అదనపు సీపీ), టి.అన్నపూర్ణ (అడ్మిన్, సైబరాబాద్ డీసీపీ), రాహుల్ హెగ్డే (హైదరాబాద్ సిటీ ట్రాఫిక్-3 డీసీపీ), అపూర్వ రావు (ఇంటెలిజెన్స్ ఎస్పీ) బదిలీ అయిన వారిలో ఉన్నారు.
చందనా దీప్తికి ప్రమోషన్ దక్కి్ందని చెప్పాలి. ప్రజెంట్ రైల్వే పోలీస్ ఎస్పీగా ఉన్న ఈమెకు సర్కార్ ఏకంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అదనపు సీపీగా ట్రాన్స్ ఫర్ చేసింది. రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో హైదరాబాద్‌కు అత్యంత కీలకం కానుంది.
ఈ కొత్త కమిషనరేట్ పరిధిలోకి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, శంకర్ పల్లి, మొయినాబాద్ వంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు వస్తాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రాంతానికి అదనపు సీపీగా నియమించబడటం అంటే ఆమెపై ప్రభుత్వానికి ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది.
రైల్వే ఎస్పీ అంటే కేవలం రైల్వే స్టేషన్లు, రైలు మార్గాల్లో జరిగే నేరాలను మాత్రమే పర్యవేక్షిస్తారు. అదనపు కమిషనర్ హోదా అనేది ఎస్పీ కంటే పైస్థాయిది. ఇది సాధారణంగా డీఐజీ (DIG) లేదా ఐజీ (IG) హోదా కలిగిన అధికారులకు ఇచ్చే పోస్టింగ్. ఒక భారీ ప్రాంతానికి శాంతిభద్రతలను పర్యవేక్షించే కీలక బాధ్యత ఇది. ఎస్పీ కంటే ఫ్యూచర్ సిటీ అదనపు సీపీగా ఆమెకు అధికార పరిధి, ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటాయి.
చందన దీప్తి IIT ఢిల్లీ నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. సివిల్ సర్వీసెస్‌పై ఆసక్తితో ప్రిపేర్ అయ్యి, 2012లో తన మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ (IPS) సాధించారు. ఆమె 2012 బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఆమె చిత్తూరు జిల్లాలో జన్మించారు, కానీ పెరిగింది హైదరాబాద్‌లో. 2019లో ఆమె పారిశ్రామికవేత్త బలరామ్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. బలరామ్ రెడ్డి ప్రముఖ రాజకీయ నేత టి.సుబ్బరామిరెడ్డికి బంధువు.
