DGP : కర్ణాటకలో సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో డీజీపీగా పనిచేస్తున్న రామచంద్రరావుకు సంబంధించిన కొన్ని అశ్లీల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ వీడియోల్లో ఆయన తన సొంత ఆఫీసులోనే డ్యూటీలో ఉండి, యూనిఫాం వేసుకుని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు.
ఆఫీసు పని పక్కన పెట్టి, లోపలికి వచ్చిన మహిళలను హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఎవరో రహస్యంగా ఈ తతంగం మొత్తాన్ని రికార్డ్ చేసి బయటపెట్టారు. ఈ విషయం తెలియగానే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “పోలీసు శాఖలో ఇంత పెద్ద పదవిలో ఉండి, ఆఫీసులోనే ఇలాంటి పనులు చేయడం ఏంటి?” అని మండిపడ్డారు. దీనిపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ಸಮವಸ್ತ್ರದಲ್ಲೆ ಡಿಜಿಪಿ ರಾಮಚಂದ್ರ ರಾವ್ ರಾಸಲೀಲೆ. #pratidhvani #dgpramachandrarao #ranyarao #ramchandrarao #ips #ramachandrarao #ipsofficer #bengaluru #DGPRamachandraRao #SexScandal #Controversy #BreakingNews #PoliticalNews #ScandalAlert #RamachandraRao #CurrentEvents #TruthUncovered pic.twitter.com/yXlrftnSwL
— Pratidhvani (@PratidhvaniNews) January 19, 2026
నివేదిక రాగానే రామచంద్రరావుపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలోనే ఆయన కూతురు రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పట్టుబడటంతో అప్పట్లో ఆయన వార్తల్లో నిలిచారు. అయితే డీజీపీ రామచంద్రరావు మాత్రం ఈ ఆరోపణలన్నీ అబద్ధమని చెబుతున్నారు.
Belagavi, Karnataka: On DGP Ramachandra Rao case, CM Siddaramaiah says, "…If they have done something wrong, we will take disciplinary action. No one is bigger than the law. We will conduct a more detailed investigation…" pic.twitter.com/slagQ2oNEA
— IANS (@ians_india) January 19, 2026
ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, తనను కావాలనే ఇరికించడానికి ఎవరో ఆ వీడియోలను మార్ఫింగ్ చేశారని ఆయన అంటున్నారు. తన ఇన్నేళ్ల సర్వీసులో ఎప్పుడూ ఇలాంటి మచ్చ లేదని, ఇది తన మీద జరుగుతున్న కుట్ర అని ఆయన వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వ్యవహారం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు పోలీసు శాఖలో పెను దుమారం రేపుతోంది.
Another Scandal rocks Karnataka.
Alleged sleaze videos of the state's Top Cop DGP Ramachandra Rao have gone viral.
IPS officer Ramachandra Rao is the step father of actress Ranya Rao who was arrested for smuggling gold into India.
Following the leak the officer has alleged… pic.twitter.com/HF3v9shrlr
— Deepak Bopanna (@dpkBopanna) January 19, 2026
