New vs Used Car: కొత్త కారా..సెకండ్ హ్యాండ్ కారా.. ఏది కొంటే బెస్ట్?

New vs Used Car

New vs Used Car: ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు ఉండాలన్నది ఎంతటి కలో.. ఒక కారు కొనుక్కోవాలనేది కూడా అంతే కలే. కానీడబ్బులు సర్దుబాటు దగ్గరే అసలు ప్రాబ్లమ్.. షోరూమ్ నుంచి కొత్త కారును ఇంటికి తీసుకురావాలా? లేదంటే తక్కువ ధరకు వచ్చే సెకండ్ హ్యాండ్ కారును తీసుకోవాలనే డౌట్ ఉంటుంది( New vs Used Car)

ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా

వాస్తవానికి కొత్త కారును షోరూమ్ నుండి ఇంటికి తీసుకువెళ్తే.. ఆ కిక్కే వేరు. కొత్త కారు కొంటే కనీసం 3 నుంచి 5 ఏళ్ల వరకు రిపేర్ల టెన్షన్ ఉండదు.దీనికి తోడు కంపెనీ వారంటీ కూడా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ, మెరుగైన మైలేజ్, భద్రత కోరుకునే వారికి కొత్త కారు సరైన ఎంపిక. అయితే, కొత్త కారు షోరూమ్ నుంచి రోడ్డు మీదకు రాగానే దాని విలువ 10 నుంచి 20 శాతం వరకు తగ్గిపోతుంది. దీనికి తోడు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా భారంగానే ఉంటాయి.

కొంచెం తెలివిగా ఆలోచించే వారు సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతారు. కొత్త కారు కొనే బడ్జెట్‌లో సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఒక లగ్జరీ సెడాన్ లేదా పెద్ద ఎస్‌యూవీ కారును సొంతం చేసుకోవచ్చు. మొదటి యజమాని అప్పటికే భారీ ధర తగ్గుదల భరించి ఉంటారు కాబట్టి మనకు అది లాభసాటిగా మారుతుంది. అయితే, ఇక్కడ ఒక రిస్క్ కూడా ఉంది. కారు కండిషన్ సరిగ్గా లేకపోతే వారంటీ ఉండదు కాబట్టి రిపేర్లు చేయించుకోవాల్సి వస్తుంది.

అందుకే సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఒక నమ్మకమైన మెకానిక్ చేత సర్వీస్ హిస్టరీని చెక్ చేయించడం చాలా ముఖ్యం. మీరు కనీసం 7 నుంచి 10 ఏళ్ల పాటు కారును మార్చకూడదు అనుకుంటే, EMI భారం మోయగలిగితే కొత్త కారు కొనండి. అలా కాకుండా కేవలం 2-3 ఏళ్లకే కారు మార్చే అలవాటు ఉన్నా లేదా తక్కువ బడ్జెట్‌లో పెద్ద కారు కావాలనుకున్నా సెకండ్ హ్యాండ్ కారు వైపు వెళ్లడం ఉత్తమమైన మార్గం. మీ అవసరాన్ని బట్టి తెలివైన నిర్ణయం తీసుకోండి.