Why News Websites Fail : ప్రస్తుతం ఆన్లైన్ మీడియా రంగంలో న్యూస్ వెబ్సైట్ల హవా నడుస్తోంది. చాలామంది తెలుగు జర్నలిస్టులు తాము కూడా సొంతగా ఎదగాలనే ఆశయంతో ఉత్సాహంగా డొమైన్ కొని వెబ్సైట్లు ప్రారంభిస్తున్నారు కానీ, అందులో 90 శాతం మంది ఆరు నెలలు కూడా గడవకముందే సైట్లను మూసివేస్తున్నారు. దీని వెనుక ప్రధానంగా అవగాహన లేకపోవడమేనని చెప్పాలి. న్యూస్ వెబ్సైట్లు ఫెయిల్ అవ్వడానికి గల లోతైన కారణాలు ఇప్పుడు మనం ఇక్కడ విశ్లేషిద్దాం.
- చాలా మంది కేవలం 100- లేదా 200 పదాలతో వార్తలు రాస్తారు. గూగుల్ అల్గారిథమ్ ప్రకారం ఇంత తక్కువ సమాచారం ఉన్న పోస్టులను “Thin Content” గా పరిగణిస్తుంది. దీనివల్ల అడ్సెన్స్ రాదు, ఒకవేళ వచ్చినా తక్కువ CPC వస్తుంది. మినిమం 300 నుంచి 500 పదాలతో వార్తలు ఉండాలి
- చాలామంది చేసే మరో తప్పు ఏంటంటే.. వేరే పెద్ద వెబ్సైట్లలో వచ్చిన వార్తలను యాజిటీజ్‌గా కాపీ చేసి తమ సైట్లో పెడతారు. గూగుల్ దీన్ని వెంటనే గుర్తిస్తుంది. దీనివల్ల సైట్ ర్యాంక్ అవ్వదు సరే కదా, అడ్సెన్స్ ఖాతా కూడా బ్యాన్ అవుతుంది.
- ఇక చాలామంది న్యూస్ వెబ్సైట్ పెట్టిన వెంటనే లక్షలు వచ్చేయాలని ఆశిస్తారు. మొదటి 3 నుండి 6 నెలల వరకు రూపాయి రాకపోయినా కష్టపడాల్సి ఉంటుంది. ఆదాయం రావడం లేదని మధ్యలోనే వదిలేస్తారు.
- వెబ్సైట్ అందంగా కనిపించాలని చాలా మంది భారీ థీమ్స్, అనవసరమైన ప్లగిన్స్ (Plugins) వాడుతుంటారు. దీనివల్ల సైట్ కోడింగ్ భారమై స్లో అవుతుంది.
- కేవలం ఫేస్బుక్ గ్రూపుల్లో లింకులు షేర్ చేయడం ద్వారా వచ్చే ట్రాఫిక్ మీదే ఆధారపడుతారు. సోషల్ మీడియా ట్రాఫిక్ కంటే గూగుల్ సెర్చ్ ద్వారా వచ్చే ట్రాఫిక్కే అడ్సెన్స్ CPC ఎక్కువగా ఇస్తుంది.
- కేవలం క్రైమ్, సినిమా వార్తలు రాయడం వల్ల సిపిసి (CPC) చాలా తక్కువగా ఉంటుంది. వార్తలతో పాటు ఫైనాన్స్, ఇన్సూరెన్స్, టెక్నాలజీ వంటి ‘హై-పేయింగ్’ ఆర్టికల్స్ రాయకపోవడం వల్ల వెబ్సైట్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావు.
- కనీసం 6 నుండి 12 నెలల పాటు నిలకడగా కంటెంట్ అందిస్తేనే గూగుల్ మీ సైట్‌ను గుర్తిస్తుంది. మధ్యలోనే వదిలేయడం వల్ల చేసిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
- అన్నీ రాసే వెబ్సైట్ కంటే, ఏదైనా ఒక అంశంపై పట్టున్న వెబ్‌సైట్‌ను గూగుల్ ఇష్టపడుతుంది. ఉదాహరణకు: కేవలం టెక్నాలజీ, కేవలం అగ్రికల్చర్, లేదా కేవలం జాబ్ నోటిఫికేషన్స్
- చాలామంది ఆర్టికల్స్ రాస్తూ పోతుంటారు ఇది సరిపోదు, మీ సైట్ బ్రాండ్ వాల్యూని పెంచుకోవాలి. టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. SEO అంటే ఏంటి.. ఎలా చేయాలో తెలుసుకోవాలి
న్యూస్ వెబ్సైట్ అనేది ఒక వ్యాపారం లాంటిది. దీనికి సమయం, ఓపిక, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. మీరు రాస్తున్న ఆర్టికల్స్ లో క్వాలిటీ ఉంటే, గూగుల్ డిస్కవర్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
Also Read :
- New vs Used Car: కొత్త కారా..సెకండ్ హ్యాండ్ కారా.. ఏది కొంటే బెస్ట్?
- Post Office బెస్ట్ స్కీమ్: రూ.200 పెట్టుబడితో రూ.10 లక్షలు!
- PMMY : ఎలాంటి షూరిటీ లేకుండా రూ.20 లక్షల లోన్.. అస్సలు మిస్ అవ్వొద్దు!
- Union Budget 2026 : TAX పేయర్స్‌కు అదిరిపోయే న్యూస్..మోదీనా.. మజాకా!
- PM Suraksha Bima Yojana : మీ బ్యాంక్ అకౌంట్లో రూ. 20 లేకపోతే.. రూ. 2 లక్షలు లాస్!
