PM Kisan 19th Instalment Release Date : రైతులకు గుడ్ న్యూస్.. ఆరోజే అకౌంట్లోకి రూ. 2 వేలు.. ఇది లేకుంటే రావు!

PM Kisan 19th Instalment Release Date

PM Kisan 19th Instalment Release Date : దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan 19th Instalment Release Date) 19వ విడత నిధుల విడుదలపై కీలక అప్‌డేట్ వచ్చింది. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనుంది.

ఈ పథకం కింద ప్రతి ఏటా రైతులకు మూడు విడతల్లో మొత్తం రూ.6 వేల ఆర్థిక సాయాన్ని మోదీ సర్కార్ అందిస్తోంది. అయితే, 19వ విడత డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా e-KYC (ఈ-కేవైసీ) పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ విడత నిధులు అందుతాయి.

మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:

పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) సందర్శించండి.
‘Beneficiary Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్ ఎంటర్ చేయండి.
‘Get Data’ పై క్లిక్ చేస్తే మీ పేమెంట్ స్టేటస్ కనిపిస్తుంది.

ఆధార్ కార్డులో ఉన్న పేరు, బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరు వేర్వేరుగా ఉంటే డబ్బులు జమ కావు. పీఎం కిసాన్ పోర్టల్‌లోని ‘Edit Aadhaar Failure Records’ ఆప్షన్ ద్వారా ఆధార్ ప్రకారం పేరును సరిచేసుకోవచ్చు.

Also Read :