PhonePe CIBIL Score Check Telugu : ప్రస్తుత రోజుల్లో లోన్ కావాలన్నా, క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా సిబిల్ స్కోర్ (CIBIL Score) అనేది అత్యంత కీలకంగా మారింది. అందుకే చాలామంది ఫోన్ పే (PhonePe), గూగుల్ పే (Google Pay) వంటి యాప్స్ ద్వారా తమ క్రెడిట్ స్కోర్‌ను(PhonePe CIBIL Score Check Telugu) తరచూ చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే తరచూ ఇలా చెక్ చేస్తే స్కోర్ పడిపోతుంది అనే ఒక భయం చాలామందిలో ఉంది. ఇందులో ఎంతవరకు నిజముందో ఇప్పుడు తెలుసుకుందాం.
నేరుగా చెప్పాలంటే.. మీరు ఫోన్ పే (PhonePe) లేదా ఇతర థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మీ సొంత సిబిల్ స్కోర్‌ను ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా మీ స్కోర్ అస్సలు తగ్గదు. దీనిని సాఫ్ట్ ఎంక్వైరీ (Soft Enquiry) అని పిలుస్తారు.
ఇంతకు సాఫ్ట్ ఎంక్వైరీ అంటే ఏమిటో తెలుసుకుందాం. మీరు మీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి వ్యక్తిగతంగా స్కోర్ చెక్ చేసినప్పుడు, అది క్రెడిట్ రిపోర్టులో సాఫ్ట్ ఎంక్వైరీగా నమోదవుతుంది. దీనివల్ల మీ క్రెడిట్ రేటింగ్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. మీరు రోజుకు పదిసార్లు చూసుకున్నా మీ స్కోర్ సురక్షితంగానే ఉంటుంది.
మరి స్కోర్ ఎప్పుడు తగ్గుతుందంటే.. స్కోర్ తగ్గడానికి ప్రధాన కారణం హార్డ్ ఎంక్వైరీ (Hard Enquiry). ఇంతకు ఇది ఏమిటి అంటే.. మీరు ఏదైనా బ్యాంకులో లోన్ కోసం లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, సదరు బ్యాంక్ వారు మీ సిబిల్ రిపోర్టును చెక్ చేస్తారు. దీనిని ‘హార్డ్ ఎంక్వైరీ’ అంటారు. మీరు తక్కువ సమయంలో ఎక్కువ బ్యాంకుల వద్ద లోన్ కోసం ట్రై చేస్తే, వరుసగా హార్డ్ ఎంక్వైరీలు జరిగి మీ సిబిల్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.
సిబిల్ స్కోర్ మెరుగుపడాలంటే ఏం చేయాలి?
లోన్ వాయిదాలు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా కట్టాలి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో 30% కంటే తక్కువగా వాడటానికి ప్రయత్నించండి. మీ పాత క్రెడిట్ కార్డ్స్ లేదా లోన్ అకౌంట్లు క్లోజ్ చేయకుండా ఉంచడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ బలంగా ఉంటుంది. ఫోన్ పే వంటి యాప్స్‌లో మీ స్కోర్ చూసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. కాబట్టి ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ, పదే పదే కొత్త లోన్ల కోసం ట్రై చేయడమే ప్రమాదకరం.
