Today Gold Rate in Hyderabad : బంగారం కొనాలా? అయితే ఒక్క నిమిషం.. ఈరోజు రేట్లు చూస్తే షాక్ అవుతారు!

Today Gold Rate in Hyderabad

Today Gold Rate in Hyderabad : మీరు బంగారం కొనాలనే ప్లాన్ లో ఉన్నారా.. అయితే మీకు ఇది మీకు సరైన సమయయే. అందులోనూ అదిరిపోయే గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు (Today Gold Rate in Hyderabad )ఒక్కసారిగా పడిపోయాయి. నిన్నటి వరకు పెరిగిన ధరలు, ఈరోజు (జనవరి 22) భారీగా తగ్గాయి. త్వరలో పెళ్లిళ్ల సీజన్ కూడా దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు బంగారం రేట్లు తగ్గడం అనేది ముఖ్యంగా ఆడవాళ్లకు పెద్ద ఊరటనిస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో పరిస్థితి ఒక్కసారి చూసుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 2 వేల 290 వరకు తగ్గింది. దీంతో .ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,310 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 2 వేల100 తగ్గింది. దీంతో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,41,450 కి చేరింది.

ధరలు తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే.. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులేనని చెప్పాలి. గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ విలువ పెరగడం వల్ల ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు పడిపోయాయి. మన దేశంలో కూడా అదే ఎఫెక్ట్ కనిపిస్తోంది. అయితే, ఈ ధరల తగ్గుదల ఎక్కువ రోజులు ఉంటుందా అంటే చెప్పలేం. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులను బట్టి రేట్లు ఎప్పుడైనా మళ్ళీ పెరగొచ్చు.

ఇది కొనడానికి సరైన సమయమేనా?

చాలా మంది జనాలు బంగారం ధర ఇంకా తగ్గుతుందేమో.. అప్పుడు కొందాంలే అని వెయిట్ చేస్తుంటారు. కానీ బంగారం మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఫిబ్రవరిలో పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, డిమాండ్ పెరిగి మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, నగలు చేయించుకోవాలనుకునే వారు ఈ రోజే ఒకసారి రేట్లను చెక్ చేసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి ధర కూడా ఈరోజు కేజీపై దాదాపు రూ. 3,500 వరకు తగ్గింది. సో వెండి సామాన్లు కొనాలనుకునే వారికి కూడా ఇది మంచి ఛాన్సే!