KTR Phone Tapping Case Notice: ఫోన్ ట్యాపింగ్ కేసు.. KTRకు నోటీసులు!

KTR Phone Tapping Case Notice

KTR Phone Tapping Case Notice : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జాబ్లీహిల్స్ ACP ఆఫీసుకు రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు.(KTR Phone Tapping Case Notice )

ఇదే కేసులో బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావును అధికారులు ఇటీవలే విచారించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు పలువురు ప్రముఖల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలున్నాయి. తాజాగా కేటీఆర్‌కు కూడా నోటీసులు రావడంతో, ఈ కేసు తదుపరి ఎటు వైపు వెళ్తుందనేది ఉత్కంఠగా మారింది. పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం.

ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పటి నుండి కేటీఆర్‌కు నేరుగా నోటీసులు జారీ చేయడం మాత్రం ఇదే తొలిసారి కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా కొందరు ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ.

బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావును అధికారులు దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఆయనను విచారించిన 48 గంటల లోపే కేటీఆర్‌కు కూడా నోటీసులు రావడం గమనార్హం.

ఇలాంటివి ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడే ప్రసక్తే లేదని.. చట్టంపై తమకు గౌరవం ఉందని తమ నేతలు విచారణకు సహకరిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. హరీష్ రావు విచారణలో వెల్లడైన అంశాలపై కేటీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది.

భయపడబోం.. నీ వెంటే పడతాం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. “మొన్న నాకు, ఇప్పుడు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు.. మేము ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకే ఈ నోటీసుల డ్రామా ఆడుతున్నారు” అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామన్నారు.