BIG BREAKING : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్, కవిత పార్టీ మార్పుపై షాకింగ్ వివరాలు వెల్లడించారు
. “కవిత మా పార్టీలో చేరుతానని అడుగుతున్నారు. ఆమె వైపు నుంచి స్పష్టమైన ప్రతిపాదనలు వస్తున్నాయి. కానీ, ఆమె చేరికను నేనే స్వయంగా వ్యతిరేకిస్తున్నాను. కవితను చేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఏమాత్రం లేదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు. తమ పార్టీలోనే ఇప్పటికే ఎంతోమంది శక్తివంతులైన, సమర్థవంతమైన నాయకులు ఉన్నారని వ్యాఖ్యానించారు.
ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని చేర్చుకుని పార్టీ ప్రతిష్టను దెబ్బతీసుకోలేమని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై ఇప్పటివరకు కల్వకుంట్ల కవిత గానీ, ఆమె కార్యాలయం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
