PM SVANidhi credit card : వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి క్రెడిట్ కార్డ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డులను కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ఈ రోజున ప్రారంభించారు. వీధి వ్యాపారులు తమ రోజూ వారి వ్యాపారం కోసం ఇతరులపై ఆధారపడకుండా ఈ కార్డును( PM SVANidhi credit card) వాడుకోవచ్చు.
గతంలో కేవలం సంపన్నులకే పరిమితమైన క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని, ఇప్పుడు చిరు వ్యాపారులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్డ్ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- ఇది యూపీఐతో లింక్ చేసుకోవచ్చు. ఇది రూపే (RuPay) క్రెడిట్ కార్డ్.
- నెలకు రూ.30,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు.
- వ్యాపార అవసరాల కోసం వాడుకుని నెలలోపు తిరిగి చెల్లిస్తే వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు.
- ఈ స్కీమ్ లో మూడు విడతల్లో రుణాలు ఇస్తారు.
- మొదటి విడతలో రూ.15వేలు, రెండో విడతలో రూ.25వేలు, మూడో విడతలో రూ.50వేల వరకు లోన్ లభిస్తుంది.
- మొదటి రుణాన్ని టైమ్ కు చెల్లిస్తేనే రెండో విడతకు, రెండోది చెల్లిస్తే మూడో విడతకు ఎలిజిబిలిటీ ఉంటుంది.
- ఈ కార్డు 5 ఏళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది.
సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించే వారికి సంవత్సరానికి 7% వడ్డీ రాయితీ (Interest Subsidy) లభిస్తుంది. ఇది నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. UPI ద్వారా అమ్మకాలు జరిపే వ్యాపారులకు నెలకు రూ.100 వరకు (ఏడాదికి రూ.1,200) క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ రుణాలు పొందడానికి ఎలాంటి తనఖా లేదా గ్యారెంటీ అవసరం లేదు.
దీనిని రెండు పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు:
- ఆన్‌లైన్ ద్వారా వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఆధార్ నంబర్‌తో లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేయవచ్చు.
- మీ సమీపంలోనిమీ-సేవ కేంద్రానికి వెళ్లి పైన పేర్కొన్న పత్రాలను సమర్పిస్తే, వారు దరఖాస్తు పూర్తి చేస్తారు.
- మీ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి పీఎం స్వనిధి విభాగంలో సంప్రదించవచ్చు.
ఆధార్ కార్డ్: లబ్ధిదారుని గుర్తింపు కోసం అత్యంత ముఖ్యం. (ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి)..
బ్యాంక్ పాస్‌బుక్: నగదు జమ కావడానికి, క్రెడిట్ కార్డు అనుసంధానం కోసం.
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు: 2 లేదా 3 ఫోటోలు సిద్ధంగా ఉంచుకోవాలి.
2030 వరకు ఈ పథకం అందుబాటులో ఉండటంతో కోట్లాది మందికి ఇది మేలు చేయనుంది.
