TGSRTC అదిరిపోయే ఆఫర్: తక్కువ బడ్జెట్‌లో గోవా టూర్.. బ్యాగులు సర్దేయండి మావా..!

TGSRTC Goa Tour

TGSRTC Goa Tour: తక్కువ బడ్జెట్‌లో గోవా వెళ్లాలనుకునే వారికి తెలంగాణ ఆర్టీసీ (TGSRTC Goa Tour) అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి రెండో వీక్ లో వరుస సెలవులు వస్తుండటంతో ఓ స్పెషల్ ప్యాకేజీతో ముందుకు వచ్చింది.

ఇంతకు ఈ ప్యాకేజీ ఏంటంటే.. జస్ట్ రూ. 3 వేల 500 కడితే చాలు.. లగ్జరీ బస్సులో మీరు గోవా వెళ్లి అక్కడి అందాలను వీక్షించవచ్చు. 3 రాత్రులు, 4 పగళ్ల పాటు సాగే ఈ విహారయాత్రలో కేవలం గోవాలోని బీచులు మాత్రమే కాకుండా చారిత్రక హంపీ నగరాన్ని, తుల్జాపూర్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రాన్ని కూడా చూడవచ్చు.

ఈ టూర్ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం లేదా టికెట్ల బుకింగ్ కోసం ఆసక్తి గల వారు 9391072283, 9063401072 నంబర్లను సంప్రదించవచ్చు. ఫిబ్రవరి సెలవులను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి.

ఇక ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే భక్తుల కోసం ఆర్టీసీ మరో ప్రత్యేక ప్యాకేజీని రెడీ చేసింది. కేవలం రూ. 3 వేల ఖర్చుతో పండరీపూర్, గానుగాపూర్, కొల్హాపూర్, తుల్జాపూర్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు పైన నంబర్లను సంప్రదించండి.