Kalamkaval :,మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ఒక గగుర్పొడిచే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా కలాంకావల్(Kalamkaval). ఇందులో మమ్ముట్టి నటన అద్భుతం అనే కంటే భయంకరం అని చెప్పాలి; ఒక పక్క ప్రశాంతంగా కనిపిస్తూనే, మరోపక్క రాక్షసత్వంతో నిండిన పాత్రలో ఆయన విశ్వరూపం చూపించారు. ఎంతో అనుభవం ఉన్న పోలీస్ ఆఫీసర్గా నటిస్తూనే, తెర వెనుక కిరాతకమైన హత్యలు చేసే విలన్ పాత్రలో ఆయన పండించిన హావభావాలు నభూతో నభవిష్యతి.
ఈ సినిమా కథ కర్ణాటకకు చెందిన భయంకరమైన సీరియల్ కిల్లర్ ‘సైయనైడ్ మోహన్’ నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించబడింది. స్కూల్ టీచర్ ముసుగులో ఉంటూ, దాదాపు 20 మందికి పైగా అమాయక మహిళలను పెళ్లి పేరుతో నమ్మించి చంపిన ఒక రాక్షసుడి వాస్తవ గాథ ఇది.
ఆ కిల్లర్ తన బాధితులకు గర్భనిరోధక మాత్రలని చెప్పి సైయనైడ్ ఇచ్చి, వారు చనిపోయాక నగలతో మాయమవ్వడం వంటి ఒళ్లు గగుర్పొడిచే సీన్లు ఈ సినిమాలో ఉన్నాయి.
అక్షరాన్ని ఆయుధంగా పట్టుకోవాల్సిన వాడే (కలాంకావల్) కామాంధుడిగా, కాలయముడిగా మారితే వ్యవస్థ ఎంతలా వణికిపోతుందో ఈ కథ చూపిస్తుంది. తన మీద అనుమానం రాకుండా పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనే ఉంటూ, వారిని తప్పుదారి పట్టించే స్టాన్లీ దాస్ పాత్రలోని మైండ్ గేమ్స్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తాయి.
నిజ జీవితంలోని మోహన్ ఎంత తెలివిగా తప్పించుకున్నాడో, సినిమాలో మమ్ముట్టి పాత్రను కూడా అంతే లోతుగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. చివరికి ఒక రాక్షసుడి ముసుగు ఎలా తొలగిపోయింది, చట్టం అతన్ని ఎలా పట్టుకుంది అనే అంశాలను ఎంతో ఎమోషనల్గా, థ్రిల్లింగ్గా ముగించారు. ముఖ్యంగా దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభ అద్భుతం టేకింగ్ బాగుంది. Sony liv లో ఉంది క్రైం థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి సినిమా నచ్చుతుంది
