Rachitha Mahalakshmi : వింటెజ్ రచిత.. పిచ్చెక్కిస్తుంది!

Rachitha Mahalakshmi

Rachitha Mahalakshmi : రచిత మహాలక్ష్మి బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన నటి. బెంగళూరులో జన్మించిన ఆమె(Rachitha Mahalakshmi), తెలుగులో ‘స్వాతి చినుకులు’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితులు. ముఖ్యంగా తమిళంలో ‘శరవణన్ మీనచ్చి’ సీరియల్‌లో మీనచ్చి పాత్ర ఆమెకు గొప్ప పేరును, గుర్తింపును తెచ్చిపెట్టింది.

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 6లో కూడా ఆమె కంటెస్టెంట్‌గా అలరించారు. వృత్తిపరంగా ఎంతో విజయవంతమైనా, వ్యక్తిగత జీవితంలో భర్త దినేష్‌తో విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారామె. సీరియల్స్ మాత్రమే కాకుండా ప్రస్తుతం సినిమాలపై కూడా దృష్టి పెడుతూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.