BIG BREAKING : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తనకు నోటీసులు జారీ చేయడం పైన ఆయన జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు. తనకు చట్టప్రకారం సిట్ నోటీసులు ఇవ్వలేదని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు ఇచ్చిన నోటీసు కూడా అక్రమమని కేసీఆర్ ఫైరయ్యారు. ఈ నోటీసు ద్వారా తన గౌరవానికి భంగం కలిగించారని కేసీఆర్ లేఖలో వెల్లడించారు.
విచారణ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని, ఈ నోటీసుల వెనుక దురుద్దేశం ఉందని ఆయన ఆరోపించారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చే క్రమంలో అనుసరించాల్సిన పద్ధతులను విస్మరించారని కేసీఆర్ తన లేఖలో వెల్లడించారు.ఈ కేసులో ఆదివారం అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ను సిట్ విచారించనుంది.
అయితే, కేసీఆర్ రాసిన ఈ లేఖతో ఇప్పుడు విచారణ జరుగుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఒకవేళ కేసీఆర్ విచారణకు హాజరుకాకపోతే సిట్ అధికారులు తదుపరి చర్యలు ఎలా తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
