Budget 2026: New Income Tax Act.. ఈ తప్పు చేస్తే రూ. 50 వేలు కట్టాల్సిందే!

new income tax act 2025

Budget 2026: కేంద్ర బడ్జెట్ అనగానే మనందరికీ కేవలం ట్యాక్స్ శ్లాబులు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఈసారి 2026 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఏకంగా 60 ఏళ్ల నాటి పాత పన్ను చట్టాన్ని తుడిచేసి, కొత్త ఇన్కమ్ టాక్స్ యాక్ట్ 2025 తీసుకొచ్చింది. ఇందులో పన్ను రేట్ల కంటే వింతైన, విప్లవాత్మకమైన మార్పులు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. అప్పట్లో రెండు పేర్లు.. ఇప్పుడు ఒక్కటే! (No more Assessment Year)

ఇప్పటివరకు మనం పన్ను కట్టేటప్పుడు Previous Year (డబ్బు సంపాదించిన ఏడాది), Assessment Year (లెక్కలు చూపించే ఏడాది) అని రెండు రకాలుగా వాడేవాళ్లం. ఇది చాలా మందికి గందరగోళంగా ఉండేది. ఏప్రిల్ 1 నుండి ఈ గొడవ వదిలిపోయింది. ఇకపై రెండింటికీ కలిపి ఒకే పేరు.. అదే టాక్స్ ఇయర్ (Tax Year). అంతా సింపుల్!

2. క్రిప్టో కాయిన్స్ ఉన్నాయా? జర జాగ్రత్త!

మీరు బిట్‌కాయిన్ లేదా ఇతర క్రిప్టో ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఈ కొత్త చట్టం మీపై గట్టి నిఘా ఉంచింది. మీ దగ్గర ఉన్న క్రిప్టో ఆస్తుల వివరాలు చెప్పకపోతే.. రోజుకు రూ. 200 చొప్పున జరిమానా బాదుతారు. ఇది గరిష్టంగా రూ. 50,000 వరకు వెళ్తుంది. కాబట్టి దాచకుండా వివరాలు చెప్పడమే మేలు.

3. యాక్సిడెంట్ బాధితులకు ఊరట

రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే లేదా గాయపడితే వారికి వచ్చే పరిహారం మీద వచ్చే వడ్డీకి కూడా ఇప్పటివరకు పన్ను కట్టాల్సి వచ్చేది. ఇది చాలా అన్యాయమని అందరూ భావించేవారు. కొత్త చట్టం దీనికి చెక్ పెట్టింది. ఇకపై ప్రమాద పరిహారంపై వచ్చే వడ్డీకి రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు.

4. పొరపాటు చేస్తే జైలు ఉండదు!

చాలా మంది పన్ను చెల్లింపుదారులు విదేశాల్లో చిన్న చిన్న ఆస్తులు ఉన్నా, తెలియక రిటర్న్స్‌లో చూపించరు. పాత చట్టం ప్రకారం దీనికి జైలు శిక్ష ఉండేది. కానీ కొత్త చట్టం ఇమ్యూనిటీ స్కీమ్ తెచ్చింది. తెలియక పొరపాట్లు చేస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షలు కాకుండా.. కేవలం కొంత ఫైన్ కట్టి ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు.

5. NRI దగ్గర ఇల్లు కొనడం ఇక చాలా ఈజీ

గతంలో ఎవరైనా NRI దగ్గర ఇల్లు కొనాలంటే TAN నంబర్ తీసుకోవాలి, చాలా ఫార్మాలిటీస్ ఉండేవి. ఇప్పుడు ఆ తిప్పలు లేవు. మీ దగ్గర పాన్ కార్డ్ (PAN Card) ఉంటే చాలు, హ్యాపీగా NRI ప్రాపర్టీ కొనుగోలు చేయవచ్చు. సామాన్యులకు ఇది పెద్ద ఊరట.