Sperm Count Increase Tips : మగవారిలో సంతానలేమి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వేల రూపాయలు ఖర్చు చేసి మందులు వాడటం లేదా హాస్పిటల్స్ చుట్టూ తిరగడం సహజం. కానీ, మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా పైసా ఖర్చు లేకుండా వీర్యకణాల కౌంట్, నాణ్యతను పెంచుకోవచ్చని మీకు తెలుసా? (Sperm Count Increase Tips)సైన్స్ నిరూపించిన ఆ 5 సింపుల్ టిప్స్ ఇవే..
1. ఫ్రీగా దొరికే ‘విటమిన్-డి’ : వీర్యకణాల కదలిక పెరగడానికి విటమిన్-డి చాలా అవసరం. దీని కోసం మీరు ట్యాబ్లెట్లు వాడాల్సిన పని లేదు. ప్రతిరోజూ ఉదయం 15-20 నిమిషాల పాటు ఎండలో నిలబడితే చాలు. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని పెంచుతుంది.
2. నిద్ర : రాత్రిపూట సరిగ్గా నిద్రపోని మగవారిలో స్పర్మ్ కౌంట్ 25% వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు గాఢ నిద్రపోవడం వల్ల శరీరం హార్మోన్లను రీఛార్జ్ చేసుకుంటుంది. ఇది పూర్తిగా ఉచితం!
3. వేడి: వృషణాల దగ్గర ఉష్ణోగ్రత పెరిగితే వీర్యకణాలు చనిపోతాయి. ప్యాంటు జేబులో ఫోన్ పెట్టుకోవడం మానేయండి. ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవద్దు. వేడి నీళ్లతో స్నానం తగ్గించి, చల్లని లేదా మామూలు నీటిని వాడండి.
4. వ్యాయామం: ఒత్తిడి అనేది మగతనాన్ని చంపేసే సైలెంట్ కిల్లర్. ప్రతిరోజూ 20 నిమిషాల పాటు నడవడం లేదా ఇంట్లోనే యోగా/ప్రాణాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, కణాల ఉత్పత్తి పెరుగుతుంది.
5. ప్లాస్టిక్ వాడకం : ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ తాగడం లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో భోజనం చేయడం వల్ల అందులోని కెమికల్స్ శరీరంలోకి చేరి హార్మోన్లను దెబ్బతీస్తాయి. దీనికి బదులు స్టీల్ లేదా గాజు గ్లాసులు వాడండి. దీనికి మనం కొత్తగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
