Couple Friendly Trailer : కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ అదిరిపోయింది.. మీరు చూశారా?

Couple Friendly Trailer

Couple Friendly Trailer : యంగ్ హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన క్రేజీ మూవీ కపుల్ ఫ్రెండ్లీ (Couple Friendly Trailer ). ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలై యూత్‌లో మంచి అంచనాలను క్రియేట్ చేస్తోంది.

దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతోంది. చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ ‘లివింగ్ టుగెదర్’ (సహజీవనం) చుట్టూ తిరుగుతుంది. ఒక జంట కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఎదురయ్యే ఫన్నీ సంఘటనలు, గొడవలు, ప్రేమను కామెడీ టచ్‌తో చూపించారు.

సంతోష్ శోభన్ తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయించారు. “ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశావో” అని అడిగితే.. “నేను నా జీవితం తప్ప ఎవరి జీవితాన్నీ నాశనం చేయలేదండీ” అని హీరో చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. మానస వారణాసి లుక్స్ మరియు చెన్నై లొకేషన్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి.

ప్రేమికుల రోజున వచ్చే సినిమాలకు యూత్ ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అందులోనూ ‘లివింగ్ టుగెదర్’ లాంటి మోడ్రన్ టాపిక్ కావడం, కామెడీకి ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.