BIG BREAKING : KCR నువ్వు జాతిపితవా?.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

cm revanth reddy, kcr

BIG BREAKING :  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు ఇచ్చినట్టేనా? అంటూ వస్తున్న వాదనలపై రేవంత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, ప్రతిపక్ష నేతలపై నిప్పులు చెరిగారు.

ఉద్యమకారుడు అనే పదాన్ని కేవలం కేసీఆర్ కుటుంబమే వాడుకుంటోందని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన కోదండరామ్ ఉద్యమకారుడు కాదా? మీ పాలనలో ఆయన్ని ఎలా అరెస్ట్ చేశారో మర్చిపోయారా? అని నిలదీశారు. తెలంగాణ వచ్చాక ఇంట్లో అందరికీ పదవులు ఇచ్చుకున్నారని, ప్రజలు ఓడించినా పదవులు వదులుకోవడానికి ఇష్టపడటం లేదని కేసీఆర్ ను  విమర్శించారు.

కేసీఆర్ ఫ్యామిలీకి నోటీసుల వ్యవహారంపై రేవంత్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేస్తే ఎవరైనా సరే విచారణ ఎదుర్కోవాల్సిందే. అక్రమాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది.మేము ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి విచారణ చేయాలి అనడం ఏంటి? చట్టం ముందు ఎవరైనా సమానమేనని స్పష్టం చేశారు. మీకు ఓటు వేయకపోతే ప్రజలే తప్పు చేశారనడం మీ అహంకారానికి నిదర్శనం అని రేవంత్ ఎద్దేవా చేశారు.

స్వేచ్ఛను హరిస్తే తిరుగుబాటు తప్పదని సీఎం హెచ్చరించారు. ఆనాటి సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి గురించి గొప్పగా చెబుతూ.. దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎంపీగా ఆయన రికార్డు సృష్టించారని, పదవులను త్యాగం చేసిన గొప్ప నేత ఆయనని కొనియాడారు. నేటి రాజకీయ నేతలు ఆయనను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.

Also Read :