IPHONE కొనాలని చూస్తున్నారా? : రూ.19 వేల డిస్కౌంట్..డొంట్ మిస్!

IPHONE

IPHONE : మీరు ఐఫోన్ 16 ప్లస్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే ఛాన్స్. రిలయన్స్ డిజిటల్ నిర్వహిస్తున్న డిజిటల్ మొబైల్ డేస్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర (IPHONE )మునుపెన్నడూ లేనంతగా తగ్గింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లలో కూడా లేని విధంగా కేవలం రిలయన్స్ డిజిటల్‌లో మాత్రమే ఈ భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక సేల్ ఫిబ్రవరి 4న ప్రారంభమై, ఫిబ్రవరి 8 వరకు కొనసాగనుంది.

ధర విషయానికి వస్తే.. ఆపిల్ సంస్థ ఐఫోన్ 16 ప్లస్‌ను మొదట రూ. 89,900 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. కానీ ఇప్పుడు ఈ సేల్‌లో ఏకంగా 15 వేల రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఫోన్ బేస్ ప్రైస్ రూ. 74,900 కి దిగి వచ్చింది. దీనికి తోడు మీరు బ్యాంక్ కార్డులను ఉపయోగిస్తే అదనంగా మరో రూ. 4,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే అన్ని ఆఫర్లు కలిపితే రూ. 70,900 కే ఈ లేటెస్ట్ ఐఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్ల పరంగా చూస్తే, ఐఫోన్ 16 ప్లస్ 6.7 అంగుళాల భారీ OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో అత్యంత వేగవంతమైన A18 బయోనిక్ చిప్‌సెట్‌ను వాడారు, ఇది ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 48MP మెయిన్ కెమెరా, ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. అంతేకాదు, ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ (IP68 రేటింగ్) ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.