BIG BREAKING : తెలంగాణ బీజేపీకి పవన్ కల్యాణ్ దిమ్మతిరిగే షాక్ !

pawan kalyan

BIG BREAKING :  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 336 వార్డుల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల సంఘం (EC) ఆమోదించిందని జనసేన వర్గాలు వెల్లడించాయి.

దీంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ ఎన్నికలను జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఏపీలో బీజేపీ-జనసేన మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగడం బీజేపీకి ఇక్కడ బిగ్ షాకే అని చెప్పాలి. పొత్తు ఉండి ఉంటే ఉమ్మడిగా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండేది. అయితే, జనసేన పోటీ చేయడం వల్ల బీజేపీకి ఎంత నష్టం జరుగుతుంది అనేది ఆయా వార్డుల్లో ఉన్న అభ్యర్థుల బలాబలాలు, స్థానిక సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది.

పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉండే యువత, పట్టణ ప్రాంత ఓటర్లు ఇప్పుడు జనసేన వైపు మళ్లే అవకాశం ఉంది. గతంలో బీజేపీకి పడే ఈ ఓట్లు ఇప్పుడు చీలిపోవడం ఆ పార్టీకి నష్టమేనని చెప్పాలి. ప్రతిపక్ష ఓట్లు ఎన్ని ఎక్కువ చీలితే, అధికార పార్టీకి అంత ఎక్కువ లాభం చేకూరుతుంది. జనసేన ఒంటరి పోరాటం వల్ల ప్రతిపక్ష వాయిస్ బలహీనపడే ఛాన్స్ ఉంది.

Also Read :