Telangana Municipal election results 2026: ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ గెలిచిందంటే..

Telangana Municipal Polls 2026

Telangana Municipal election results 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో (ఫిబ్రవరి 13, 2026) ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా (Telangana Municipal election results 2026)కాంగ్రెస్ పార్టీ తన జోరును ప్రదర్శిస్తుండగా, బీఆర్‌ఎస్ ఇతర పార్టీలు కూడా కొన్ని కీలక స్థానాల్లో తమ పట్టును నిరూపించుకున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లోని మెజారిటీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ముఖ్యంగా నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌, హాలియా, నందికొండ వంటి చోట్ల స్పష్టమైన మెజారిటీ సాధించడమే కాకుండా, ఉత్తర తెలంగాణలోని ధర్మపురి, భీంగల్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి వంటి పురపాలికల్లోనూ జయకేతనం ఎగురవేసింది. మరిపెడ, డోర్నకల్‌, అశ్వారావుపేట, నారాయణ ఖేడ్‌లలో సైతం హస్తం పార్టీ ఏకపక్ష విజయాలను నమోదు చేసింది.

మరోవైపు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కూడా కొన్ని మున్సిపాలిటీల్లో తన ఉనికిని చాటుకుంది. మంత్రి ఇలాకాలో షాక్ ఇస్తూ క్యాతనపల్లిని దక్కించుకోవడంతో పాటు, గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్‌ మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగురవేసింది. ఇక జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (తెలంగాణ జాగృతి మద్దతుతో) సంచలన విజయం సాధించి మున్సిపాలిటీని తన వశం చేసుకుంది.

కాగా, కొన్ని మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దేవరకద్ర, అలంపూర్‌, కోహీర్‌ మరియు కేసముద్రం మున్సిపాలిటీల్లో ఫలితాలు అనిశ్చితిగా ఉన్నాయి. ఇక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంలో స్వతంత్ర అభ్యర్థులు మరియు ఇతర చిన్న పార్టీలు ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయి. మరికొన్ని గంటల్లో మరిన్ని వార్డుల పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.