Band Melam : బ్యాండ్ మేళం.. బెస్ట్ ఫ్రెండ్కు తాళి కట్టాడు!

Band Melam

Band Melam :  కోర్ట్ అనే చిన్న సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్ష్ రోషన్, శ్రీదేవి గుర్తున్నారా? ఈ క్రేజీ జోడీ ఇప్పుడు బ్యాండ్ మేళం అంటూ మరోసారి మనల్ని పలకరించబోతున్నారు. సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్‌ను వాలెంటైన్స్‌ డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు.

వీడియో మొదలవ్వడం ఒక లవ్ ఫెయిల్యూర్ యువకుడి ఎమోషనల్ సీన్‌తో సీరియస్‌గా మొదలైంది. కానీ, చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు! హీరో తన స్నేహితుడికే తాళి కట్టడం చూస్తుంటే, సినిమాలో కామెడీ డోస్ గట్టిగానే ఉంటుందని అర్థమవుతోంది.

ఈ మూవీలో హర్ష్ రోషన్ ఒక మ్యూజీషియన్‌గా కనిపిస్తుండగా, శ్రీదేవి ‘రాజమ్మ’ అనే పల్లెటూరి గడుసు అమ్మాయి పాత్రలో అలరించనుంది. గ్లింప్స్ చూస్తుంటే ఇది పక్కా తెలంగాణ నేటివిటీతో సాగే ఒక రూరల్ మ్యూజికల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. కోన వెంకట్ సమర్పణలో, కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు.

‘కోర్ట్’ లాంటి హిట్ తర్వాత ఈ జోడీ చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి! మార్చి 13న థియేటర్ లోకి రానుంది.