Funky Review : పంచులు ఉన్నాయి కానీ ప్రాపర్ సీన్లే లేవు!

funky

Funky Review : జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ క్రేజీ డైరెక్టర్ అయిన K V అనుదీప్ డైరెక్షన్ వచ్చిన మరో సిల్లీ ఫన్నీ సినిమా ఫంకీ. నిర్మాత నాగవంశీ ముందే చెప్పేశాడు ఇదేమీ గొప్ప సినిమా కాదు సిల్లీ సిల్లీగా ఉండే సినిమా అని. సో వాళ్ళే చెప్పేశాక ఇంక మనమేం చెప్తాం. ఒక సీన్ అనుకుని అందులో రెండు పంచులు పడితే బాగుంటుంది కాని ప్రోపర్ సీన్లు, స్క్రీన్ ప్లే లేకుండా సినిమా అంతా సిల్లీగా అనిపించే పంచులు మీద పంచులు వస్తుంటే ఏం బాగుంటుంది.

అనుదీప్ స్టైల్ కామెడీని ఇష్టపడే ఇంటర్ బ్యాచ్ యూత్ కి తప్పితే మెచ్యుర్డ్ కామెడీని ఆశించే వాళ్ళకి మాత్రం ఎంత మాత్రం సినిమా నచ్చదు. సినిమాలో సినిమాకి సరిపడా కథ ఉంది, మదర్ ఎమోషన్ ఉంది, హీరో క్యారెక్టర్ లో ఉండే పెయిన్ బయట చాలామందిలో ఉంటుంది అలాగే లవ్ ట్రాక్ ఉంది కాని డైరెక్టర్ వేటి మీద శ్రద్ధ పెట్టలేదు, ఫోకస్ చేయలేదు ఓన్లీ పంచులనే నమ్ముకున్నాడు. అలాగే సినిమాలో సీరియస్ నెస్ ఉండాల్సిన చోట కూడా సిల్లీ గానే ఉంటుంది అందువల్ల సినిమాల కాకుండా లాంగ్ ఈటీవీ పటాస్ షో లా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లు పర్లేదు అనిపిస్తాయి.

4 కోట్లలో సినిమా తీస్తాను అని చెప్పి 40 కోట్లు బడ్జెట్ చేసిన బడ్డింగ్ డైరెక్టర్ గా విశ్వక్సేన్ ఉన్నంతలో బాగానే చేసిన ఈ క్యారెక్టర్ కి రాంగ్ చాయిస్ అని చెప్పాలి. కామెడీటైమింగ్ బాగా ఉన్న నవీన్ పోలిశెట్టి వాళ్ళు చేస్తే ఎంతో కొంత మెరుగుపడేది సినిమా. ప్రొడ్యూసర్ డాటర్ గా కయాదు లోహర్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. బంగినపల్లి మామిడి కాయల ఉంది. సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే అది కయాదునే. నరేష్ రోల్ ఓకే GK గా సంపత్ నాట్ ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్లు గా చేసిన కుర్రోళ్ళు బాగా చేసారు. గెస్టులుగా దిల్ రాజు, నాగవంశీ, హరీష్ శంకర్, కళ్యాణ్ కృష్ణ చేసారు. అనుదీప్ ట్రాక్ బానే అనిపిస్తుంది.

భీమ్స్ మ్యూజిక్ లో రెండు పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ అసలు బాలేదు. నిర్మాత నాగవంశీ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి. సో అనుదీప్ స్టయిల్ నవ్వురాని సిల్లీ పంచులు మీకు ఇష్టమైతే ఫంకీ హ్యాపీగా చూడొచ్చు మిగతావాళ్ళు సైలెంట్ అవ్వొచ్చు.