BIG BREAKING : కవితకు బిగ్ షాక్.. ప్లేట్ ఫిరాయించారు!

kavitha

BIG BREAKING : తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవితకు మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఊహించని షాక్ తగిలింది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కవిత మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గెలిచిన ఎనిమిది మంది కౌన్సిలర్లు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. తమకు ప్రజలు క్లియర్ మాండేట్ ఇచ్చారని, కాంగ్రెస్ వాళ్లు ప్రలోభ పెడుతున్నారని కవిత ఉదయం ప్రెస్ మీట్‌లో ఆరోపించిన కొద్ది గంటల్లోనే.. సీన్ రివర్స్ అయింది.

గెలిచిన ఆ ఎనిమిది మంది కౌన్సిలర్లు నేరుగా హైదరాబాద్ చేరుకుని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో వడ్డేపల్లి మున్సిపల్ పీఠం హస్తం వశమైంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని కవిత అన్న మాటలకు, కాంగ్రెస్ ఇలా కౌంటర్ ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తన మద్దతుదారులుగా చెప్పుకున్న వారు ఇలా అధికార పార్టీలోకి వెళ్లడం కవితకు పెద్ద రాజకీయ దెబ్బగా భావిస్తున్నారు.