Personal Loan 2026 : తక్కువ వడ్డీకే లోన్లు ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే!

personal loan 2026

Personal Loan 2026 : సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, పిల్లల చదువులకైనా లేదా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా.. ఈ రోజుల్లో అందరూ ముందుగా చూసేది పర్సనల్ లోన్(Personal Loan2026). అయితే, పర్సనల్ లోన్ అనగానే వడ్డీ రేట్లు భయంకరంగా ఉంటాయని చాలామంది భయపడతారు. కానీ, 2026లో పరిస్థితి మారింది. కొన్ని బ్యాంకులు చాలా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. మీరు కూడా లోన్ కోసం ప్లాన్ చేస్తుంటే, ప్రస్తుతం మార్కెట్‌లో అతి తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న టాప్ 5 బ్యాంకుల వివరాలు మీకోసం..

1. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra)
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, అతి తక్కువ వడ్డీ రేటును అందిస్తున్న బ్యాంకుల్లో ఇది మొదటి స్థానంలో ఉంది. వడ్డీ రేటు: 8.75% నుండి ప్రారంభం. మహిళలకు, రక్షణ శాఖలో పని చేసే వారికి వడ్డీలో మరికొంత రాయితీ లభిస్తుంది.

2. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank)
ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు వేగంగా లోన్స్ ఇవ్వడంలో ముందుంటుంది. వడ్డీ రేటు: 9.99% నుండి 24% వరకు (మీ క్రెడిట్ స్కోర్‌ను బట్టి ఉంటుంది). శాలరీ అకౌంట్ ఉన్నవారికి కేవలం 10 సెకన్లలోనే లోన్ డిస్‌బర్సల్ అయ్యే అవకాశం ఉంది.

3. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)

మరో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ కూడా ఆకర్షణీయమైన రేట్లతో ముందుకు వచ్చింది. వడ్డీ రేటు: 9.99% నుండి ప్రారంభం. డిజిటల్ ప్రాసెస్ ద్వారా ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా సులభంగా లోన్ పొందవచ్చు.

4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)

నమ్మకానికి మారుపేరుగా ఉండే ఎస్‌బీఐ ఎప్పుడూ తన కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లనే ఆఫర్ చేస్తుంది. వడ్డీ రేటు 10.05% నుండి 15.05% వరకు. ప్రాసెసింగ్ ఫీజు తక్కువగా ఉంటుంది. ఎటువంటి హిడెన్ ఛార్జీలు ఉండవు.

5. యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)
యాక్సిస్ బ్యాంక్ కూడా పోటీకి తగ్గట్టుగా తన పర్సనల్ లోన్ రేట్లను తగ్గించింది. వడ్డీ రేటు: 9.99% నుండి ప్రారంభం. మీరు ₹40 లక్షల వరకు పెద్ద మొత్తంలో లోన్ పొందే వెసులుబాటు ఉంటుంది.

లోన్ తీసుకునే ముందు ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి:

మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటేనే పైన చెప్పిన అతి తక్కువ వడ్డీ రేట్లు మీకు వర్తిస్తాయి. వడ్డీతో పాటు బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు (0.5% నుండి 2% వరకు) కూడా చెక్ చేసుకోండి.మీరు లోన్‌ను ముందే కట్టేయాలనుకుంటే బ్యాంకులు ఏవైనా పెనాల్టీలు వేస్తున్నాయా అనేది అడిగి తెలుసుకోండి. వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. లోన్ తీసుకునే ముందు మీ సమీప బ్యాంక్ శాఖను సంప్రదించడం ఉత్తమం.