Weight Loss At Home : బరువు తగ్గాలనుకుంటున్నారా? 30 రోజుల్లో పొట్ట తగ్గించే బెస్ట్ డైట్ ప్లాన్!

30 Days Weight Loss Diet Plan Telugu

Weight Loss At Home :  నేటి ఉరుకుల పరుగుల జీవితం, మారిన ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఊబకాయం (Weight Loss At Home). పొట్ట దగ్గర కొవ్వు. జిమ్‌కి వెళ్లి గంటల కొద్దీ వర్కౌట్లు చేసే సమయం లేని వారు, కేవలం తమ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. 30 రోజుల్లో మీ బరువులో మార్పు తెచ్చే సింపుల్ డైట్ ప్లాన్ ఎంటో ఇప్పుడు చూద్దాం.

1. ఉదయాన్నే పరగడుపున (Early Morning)

రోజూ ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగండి. ఇది మీ శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి, మెటబాలిజంను పెంచుతుంది.

2. అల్పాహారం (Breakfast – ఉదయం 8:30 లోపు)

అల్పాహారం ఎప్పుడూ పోషకాలతో నిండి ఉండాలి. నూనె లేని రెండు ఇడ్లీలు లేదా ఒక దోశ (సాంబార్‌తో) లేదంటే ఓట్స్ లేదా రాగి జావ. ఇది కాదంటే ఉడికించిన గుడ్లు (తెల్లసొన మాత్రమే) తీసుకోండి

3. మధ్యాహ్న భోజనం (Lunch – మధ్యాహ్నం 1:00 లోపు)

మధ్యాహ్నం పూట కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ పెంచాలి. ఒక చిన్న కప్పు బ్రౌన్ రైస్ లేదా రెండు జొన్న రొట్టెలు తీసుకోండి. ఎక్కువగా ఆకుకూరలు, పప్పు లేదా కూరగాయల కూరలు. ఒక కప్పు పెరుగు లేదా మజ్జిగ కచ్చితంగా ఉండాలి. భోజనానికి ముందు ఒక ప్లేట్ సలాడ్ (కీరదోస, క్యారెట్) తింటే ఆకలి తక్కువగా వేస్తుంది.

4. సాయంత్రం స్నాక్స్ (Evening – 4:00 నుండి 5:00 మధ్య)

ఆకలి వేసినప్పుడు చిప్స్, బిస్కెట్లు కాకుండా ఒక గుప్పెడు వేయించిన శనగలు లేదా డ్రై ఫ్రూట్స్ (బాదం, వాల్‌నట్స్) తీసుకోండి. గ్రీన్ టీ తాగడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది.

5. రాత్రి భోజనం (Dinner – రాత్రి 8:00 లోపు)

బరువు తగ్గడంలో అత్యంత కీలకమైనది రాత్రి భోజనం. ఇది చాలా తేలికగా ఉండాలి. రెండు పుల్కాలు లేదా ఒక కప్పు వెజిటబుల్ సూప్. రాత్రిపూట అన్నం తినడం మానేస్తే పొట్ట త్వరగా తగ్గుతుంది. భోజనం చేసిన కనీసం రెండు గంటల తర్వాతే నిద్రపోవాలి.

రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగండి. స్వీట్లు, కూల్ డ్రింక్స్ పూర్తిగా మానేయండి. ఉప్పు వాడకం తగ్గించండి. రోజుకు 7 లేదా -8 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్ర లేకపోతే ఒత్తిడి పెరిగి బరువు పెరుగుతారు. రోజుకు కనీసం 30 నిమిషాలు వేగంగా నడవండి. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, డైట్ ప్రారంభించే ముందు డాక్టరును సంప్రదించండి.