SBI Insurance Scheme : SBIలో రోజుకు 8 రూపాయలు కడితే రూ. 60 లక్షల బీమా!

SBI 60 Lakhs Accidental Insurance Scheme

SBI Insurance Scheme : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల కోసం ఒక అద్భుతమైన భరోసాను ఇచ్చే స్కీమ్‌ను( SBI Insurance Scheme ) తీసుకొచ్చింది. ఈ రోజుల్లో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది.

దీని ప్రత్యేకత ఏంటంటే, మనం ఏడాది మొత్తానికి కేవలం రూ. 3,000 చెల్లిస్తే చాలు, ఏకంగా రూ. 60 లక్షల బీమా సౌకర్యం లభిస్తుంది. అంటే మనం రోజుకు ఖర్చు చేసేది కేవలం రూ. 8.20 పైసలు మాత్రమే అన్నమాట. ఈ పథకంలో చేరడం కూడా చాలా సులభం. మీరు మీ బ్యాంకుకు వెళ్లి ఒకసారి అంగీకార పత్రం ఇస్తే సరిపోతుంది, మీ ఖాతా నుండి ఏటా ఆ రూ. 3,000 ఆటోమేటిక్‌గా కట్ అయి పాలసీ రిన్యూవల్ అయిపోతుంది. ప్రతి సంవత్సరం మీరు బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు.

ఒకవేళ ఈ బీమా తీసుకున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గానీ, ఏదైనా ప్రకృతి విపత్తుల వల్ల గానీ, చివరికి పాముకాటు వంటి ప్రమాదాల వల్ల మరణించినా ఈ పథకం వర్తిస్తుంది. అలాంటి సమయంలో డెత్ సర్టిఫికెట్ బ్యాంకులో సమర్పిస్తే, నామినీ ఖాతాలోకి నేరుగా రూ. 60 లక్షల పరిహారాన్ని జమ చేస్తారు.

కేవలం ఈ పెద్ద మొత్తం మాత్రమే కాకుండా, ఆ కుటుంబానికి మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంటి యజమానిని కోల్పోయిన ఆ కుటుంబంలోని ఇద్దరు పిల్లల చదువుల కోసం అదనంగా రూ. 20,000 సాయం అందిస్తారు. అంతేకాకుండా అంత్యక్రియల ఖర్చుల కోసం రూ. 10,000, అంబులెన్స్ ఖర్చుల కోసం రూ. 1,500 కూడా ఈ పథకం కింద లభిస్తాయి.

అయితే ఈ బీమా విషయంలో కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి, అవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం ప్రమాదాల వల్ల జరిగే మరణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా లేదా డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకుని మరణించినా ఈ బీమా డబ్బులు రావు.

అలాగే ఏదైనా అనారోగ్యం వల్ల లేదా ఇతర వ్యాధుల వల్ల మరణించినా ఈ పథకం వర్తించదని గుర్తుంచుకోవాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ భద్రత కోరుకునే ఎస్‌బీఐ ఖాతాదారులకు ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. మీరు కూడా మీ కుటుంబ భవిష్యత్తు కోసం ఈ చిన్న మొత్తాన్ని కేటాయించి ఈ భారీ బీమాను పొందవచ్చు.

Also Read :