Rashmika Mandanna : బాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, కృతి సనన్ కలిసి నటించిన కాక్టెయిల్ 2 షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. అయితే, ఈ సినిమాలో రష్మిక(Rashmika Mandanna ) ఒక సరికొత్త ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నారనే చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం కాక్టెయిల్ 2లో రష్మిక మందన్న, కృతి సనన్ లెస్బియన్ కపుల్ గా కనిపించబోతున్నారట. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య సాగే ఒక విభిన్నమైన ప్రేమకథగా కాక్టెయిల్ 2 ఉంటుందని సమాచారం. మేకర్స్ నుండి దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా బోల్డ్‌గా, కొత్తగా ఉంటుందని మాత్రం సినీ వర్గాల భోగట్టా.
దర్శకుడు హోమీ అదజానియా ఇప్పటికే షూటింగ్ పూర్తయినట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. సెప్టెంబర్ 2026లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి, రష్మిక తన కెరీర్లో అత్యంత సాహసోపేతమైన పాత్రను ఎంచుకున్నారా లేదా అనేది తెలియాలంటే సినిమా టీజర్ లేదా ట్రైలర్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక, మరోవైపు తన వ్యక్తిగత జీవితం వల్ల కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండతో ఆమె వివాహం జరగబోతోందని ప్రచారం సాగుతోంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోగ్రాఫర్లతో కూడా సీక్రెట్ అగ్రిమెంట్లు చేయించుకున్నారని, అతి కొద్దిమంది బంధువుల మధ్యే ఈ వేడుక జరుగుతుందని సమాచారం.
అయితే, దీనిపై కూడా రష్మిక గానీ, విజయ్ గానీ ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు. రష్మిక తన ఇంటర్వ్యూలలో మాత్రం ఈ ఏడాది కెరీర్ పరంగా తనకు చాలా ముఖ్యమైనదని చెబుతున్నారు.
