Natural Pregnancy : లక్షలు ఖర్చు పెట్టి IVF వద్దు.. ఈ 3 నెలల డైట్‌తో గర్భం దాల్చడం గ్యారెంటీ!

Natural Pregnancy

Natural Pregnancy : ఖరీదైన ఐవీఎఫ్ (IVF) చికిత్సల జోలికి వెళ్లకుండా, కేవలం మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సహజంగానే(Natural Pregnanc) తల్లిదండ్రులు కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు గర్భం దాల్చడంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరిగే ముందు, దంపతులిద్దరూ తమ శరీరాన్ని లోపలి నుండి సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. పురుషులలో వీర్యకణాల నాణ్యత పెరగాలన్నా, స్త్రీలలో అండం ఆరోగ్యంగా విడుదల కావాలన్నా కనీసం మూడు నెలల సమయం పడుతుంది. అందుకే ఈ 90 రోజుల డైట్ ప్లాన్ మీకోసం.

మొదటి నెలలో ప్రధానంగా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంపై దృష్టి పెట్టాలి. మనం రోజూ తినే పంచదార, మైదా, ప్రాసెస్ చేసిన ఆహారాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. అందుకే మొదటి 30 రోజులు వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి. ప్లాస్టిక్ డబ్బాలు లేదా బాటిల్స్‌లో ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వాటిలోని రసాయనాలు శరీరంలోకి చేరి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందుకే స్టీలు లేదా గాజు పాత్రలు వాడటం అలవాటు చేసుకోవాలి. శరీరంలో విషతుల్యాలు బయటకు పోవాలంటే రోజుకు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగడం తప్పనిసరి.

రెండవ నెలలో అండం, వీర్యకణాల నాణ్యతను పెంచే పౌష్టికాహారం తీసుకోవాలి. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో ఉండే ఫోలేట్ డిఎన్‌ఏ నాణ్యతను మెరుగుపరుస్తుంది. దానిమ్మ, బెర్రీలు, ఉసిరికాయ వంటి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇవి హార్మోన్లు సరిగ్గా విడుదలయ్యేలా చూస్తాయి. ఈ సమయంలో భార్యాభర్తలిద్దరూ మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం వల్ల శరీరంలో సానుకూల మార్పులు వస్తాయి.

మూడవ నెల వచ్చేసరికి శరీరం గర్భధారణకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. ఈ దశలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం అంటే గుడ్లు, పప్పు ధాన్యాలు, మొలకెత్తిన గింజలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పురుషులు గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల కణాల కదలిక వేగవంతం అవుతుంది. విటమిన్ డి అనేది సంతానోత్పత్తికి చాలా కీలకం, కాబట్టి ప్రతిరోజూ ఉదయం కాసేపు ఎండలో గడపడం మర్చిపోవద్దు. రాత్రి 10 గంటల కల్లా నిద్రపోవడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి మెరుగ్గా జరుగుతుంది. ఇలా 90 రోజుల పాటు క్రమశిక్షణతో ఆహారం, వ్యాయామం పాటిస్తే, ఎటువంటి ఖరీదైన ట్రీట్‌మెంట్స్ అవసరం లేకుండానే సహజంగానే గర్భం దాల్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.

“గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా డైట్ ప్లాన్ లేదా మార్పులు చేసే ముందు మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం.”