Rashmika Mandanna : విజ్జూ.. నీ భార్యనవుతున్నందుకు ఎగ్జైటింగ్‌గా ఉంది: రష్మిక ఎమోషనల్ పోస్ట్!

Rashmika Mandanna

Rashmika Mandanna : టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త ఎట్టకేలకు నిజమైంది. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను ‘మై హస్బెండ్’ అని సంబోధిస్తూ ఒక సుదీర్ఘమైన, అత్యంత ప్రేమపూర్వకమైన పోస్ట్ షేర్ చేసింది. అందులో తన మనసులోని మాటలను ఇలా చెప్పుకొచ్చింది.

“నా భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నాను. అసలైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో, మనశ్శాంతి అంటే ఏంటో నాకు నేర్పించిన వ్యక్తి విజయ్. పెద్ద కలలు కనడం తప్పు కాదని, నా ఊహకు అందని విజయాలను నేను సాధించగలనని ప్రతిరోజూ నాలో ధైర్యాన్ని నింపాడు. ఎవరూ చూడటం లేదన్నట్టుగా స్వేచ్ఛగా నాట్యం చేసే స్వేచ్ఛను ఇచ్చాడు. స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేయడం ఎంత బాగుంటుందో చూపించాడు. నిజం చెప్పాలంటే ఈ వ్యక్తి గురించి నేను ఒక పుస్తకమే రాయగలను” అంటూ రష్మిక ఎమోషనల్ అయ్యింది.

 

“నేను ఈరోజు ఏ స్థాయిలో ఉన్నానో, ఎలాంటి మహిళగా మారాలని కలలు కన్నానో.. అవన్నీ నీ వల్లే సాధ్యమయ్యాయి. నిన్ను నా జీవితంలోకి పంపినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలిని. విజ్జూ.. నీపై నాకున్న ప్రేమని చెప్పడానికి మాటలు సరిపోవు. నా కష్టాలు, సుఖాలు, విజయాలు.. వీటన్నింటికీ ఇప్పుడు ఒక అర్థం దొరికింది. ఎందుకంటే వీటన్నింటికీ సాక్ష్యంగా, నా జీవితంలో అతిపెద్ద భాగస్వామిగా నువ్వు ఉన్నావు” అని రష్మిక పేర్కొంది.

“నీ భార్యను కావడానికి నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడం, నీ భార్య అని పిలవబడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మన లైఫ్ అంతా ఒక ఫుల్ పార్టీలా ఉండబోతోంది. మనమిద్దరం కలిసి ప్రపంచంలోనే అత్యుత్తమ జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యూ విజయ్” అంటూ రష్మిక తన పోస్ట్‌ను ముగించింది.