BIG BREAKING : అనిల్ రావిపూడి మళ్లీ మల్టీస్టారర్: వెంకీ, కల్యాణ్ రామ్‌తో!

Anil ravipudi

BIG BREAKING :  వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించారు.చిరుతోఈ ఏడాది మన శివశంకరవరప్రసాద్ సినిమాతో మంచి హిట్టు కొట్టారు. ఇందులో చిరుతో పాటుగా వెంకటేష్‌ను కలిపి సూపర్ హిట్ కాంబినేషన్‌ను సెట్ చేసిన అనిల్, ఇప్పుడు వెంకటేష్‌కు  తోడుగా నందమూరి కల్యాణ్ రామ్‌ను రంగంలోకి దించుతున్నారు.

ఈ ఇద్దరు హీరోల బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అనిల్ ప్లాన్ చేశారు. ఈ మేరకు ఆపిషియల్ గా ప్రకటించారు అనిల్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ అంటేనే కలిసొచ్చే అంశం.

గతంలో ఆయన సంక్రాంతికి విడుదల చేసిన సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలతో రాబోతుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.