Big Breaking : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు క్లీన్ చీట్

BIG BREAKING

చాలా కాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసును విచారించిన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు, కవితపై ఉన్న ఆరోపణలన్నింటినీ కొట్టివేస్తూ ఆమెకు పూర్తి స్థాయిలో ‘క్లీన్ చీట్’ ఇచ్చింది. సిబిఐ (CBI) దాఖలు చేసిన అభియోగాల్లో తగిన బలం లేదని, ఆమె తప్పు చేసినట్లు ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లభించలేదని కోర్టు స్పష్టం చేసింది.


సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మందిని కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వారందరిపై మోపబడిన అభియోగాలు నిలకడగా లేవని, వారు ఏదైనా కుంభకోణానికి పాల్పడ్డారని నిరూపించడానికి దర్యాప్తు సంస్థలు సరైన ఆధారాలను చూపలేకపోయాయని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ఇరుక్కున్న అందరికీ పెద్ద ఉపశమనం లభించినట్లయింది.


ఇదే కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. ఆయనపై మోపబడిన ఆరోపణలకు కూడా ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో గత కొంతకాలంగా సాగుతున్న ఈ లిక్కర్ స్కామ్ వివాదానికి ఒక ముగింపు పడినట్లయింది. రాజకీయంగా కూడా కవిత, కేజ్రీవాల్‌లకు ఈ విజయం పెద్ద బూస్ట్‌గా మారనుంది.

కోర్టు తీర్పు అనంతరం.. అరవింద్ కేజ్రీవాల్ ఎమోషనల్ అయ్యారు.. కోర్టు ఎదుట ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఏ తప్పు చేయడని, ఆమ్ ఆద్మీ పార్టీ ఏ తప్పు చేయదని.. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని సూచించారు. అటు కోర్టు కూడా.. సిబిఐ పై మండిపడింది. సాక్షాదారాల్లేకుండా ఈ కేసులో వారిని ఇరికించాలని చూశారని మండిపడింది.