Arvind Kejriwal : బీజేపీ 10 సీట్లు గెలిస్తే.. మోదీకి కేజ్రీవాల్ సంచలన సవాల్!

Arvind Kejriwal

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు నుండి క్లీన్ చిట్ లభించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పుతో తన నిజాయితీ నిరూపితమైందని పేర్కొన్న కేజ్రీవాల్.. ప్రధానికి ఒక భారీ సవాల్ విసిరారు.

“మోదీ నిజంగానే నిజాయితీపరులైతే, ఢిల్లీలో వెంటనే మళ్లీ ఎన్నికలు పెట్టాలి. ఆ ఎన్నికల్లో బీజేపీకి 10 సీట్లు దాటి వస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటాను” అని ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు దేశరాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ పార్టీని అంతం చేయడానికి ఈడీ, సీబీఐలను ఆయుధాలుగా వాడుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.

“నేను నా జీవితంలో సంపాదించుకున్నది కేవలం నిజాయితీ, గౌరవం మాత్రమే. దానిని నాశనం చేసేందుకు మద్యం కుంభకోణం పేరుతో కుట్ర పన్నారు. ఈ కుట్ర వల్ల ఢిల్లీలోని మూడు కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీనికి బాధ్యత వహిస్తూ మోదీ, అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

కేజ్రీవాల్ చేసిన ఈ ‘రాజకీయ సన్యాసం’ సవాల్‌పై బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

క్లీన్ చీట్ ఇచ్చింది వీళ్లకే

1) కుల్దీప్ సింగ్

2) నరేందర్ సింగ్

3) విజయ్ నాయర్

4) అభిషేక్ బోయిన్‌పల్లి

5) అరుణ్ రామచంద్ర పిళ్ళై

6) మూత గౌతమ్

7) సమీర్ మహేంద్రు

8) మనీష్ సిసోడియా

9) అమన్‌దీప్ సింగ్ ధాల్

10) అర్జున్ పాండే

11) బుచ్చిబాబు గోరంట్ల

12) రాజేష్ జోషి

13) దామోదర్ ప్రసాద్ శర్మ

14) ప్రిన్స్ కుమార్

15) అరవింద్ కుమార్ సింగ్

16) చాన్‌ప్రీత్ సింగ్ రాయత్

17) కవిత కల్వకుంట్ల

18) అరవింద్ కేజ్రీవాల్

19) దుర్గేష్ పాఠక్

20) అమిత్ అరోరా

21) వినోద్ చౌహాన్

22) ఆశిష్ చంద్ మాథుర్

23) శరత్ చంద్ర రెడ్డి