iPhone vs Samsung: స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే ప్రతి ఒక్కరినీ వేధించే ఒకే ఒక ప్రశ్న.. iPhone తీసుకోవాలా లేక Samsung తీసుకోవాలా? ఈ రెండు బ్రాండ్ల మధ్య యుద్ధం దశాబ్దాలుగా నడుస్తోంది. ఒకరు డిజైన్, సెక్యూరిటీలో తోపు అంటే, ఇంకొకరు ఫీచర్స్ ,డిస్ప్లేలో కింగ్ అనిపించుకుంటున్నారు. మరి 2026లో మీ అవసరాలకు ఏది సెట్ అవుతుందో ఈ చిన్న పోలికతో తేల్చేద్దాం రండి!
ముందుగా iPhone గురించి చెప్పుకుంటే.. ఆపిల్ అంటేనే ఒక స్టేటస్ సింబల్. ఐఫోన్ వాడటంలో ఉండే User Experience చాలా స్మూత్‌గా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం వారి సొంత iOS సాఫ్ట్వేర్. ఐఫోన్ కెమెరా క్వాలిటీ, ముఖ్యంగా వీడియో రికార్డింగ్ విషయంలో ఇప్పటికీ దీనికి తిరుగులేదు. మీరు సోషల్ మీడియాలో రీల్స్ లేదా వీడియోలు ఎక్కువగా చేస్తూ, ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా నాలుగైదు ఏళ్లు వాడాలనుకుంటే ఐఫోన్ బెస్ట్ ఆప్షన్. పైగా ఆపిల్ ఇచ్చే Security and Privacy ఫీచర్స్ మీ డేటాని చాలా సేఫ్‌గా ఉంచుతాయి.
ఇక Samsung విషయానికి వస్తే.. ముఖ్యంగా వారి S-Series, Z-Fold మోడల్స్ టెక్నాలజీలో నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. శామ్సంగ్ స్క్రీన్ క్వాలిటీ (AMOLED Display) ముందు ఐఫోన్ కూడా ఒక్కోసారి వెలవెలబోతుంది. శామ్సంగ్ ఇచ్చే 100X Zoom కెమెరా ఫీచర్ దూరం ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా చూపిస్తుంది. ఆండ్రాయిడ్ కాబట్టి మనకు నచ్చినట్లు ఫోన్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాదు, శామ్సంగ్ ఇప్పుడు తీసుకొచ్చిన Galaxy AI ఫీచర్స్ ఫోన్ వాడే విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి.
రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడా
అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడా Ecosystem. మీ దగ్గర ఆల్రెడీ Mac, iPad లేదా Apple Watch ఉంటే ఐఫోన్ తీసుకోవడం వల్ల అన్ని డివైజెస్ మధ్య డేటా షేరింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అదే మీరు విండోస్ లాప్టాప్ వాడుతూ, ఫైల్స్ ట్రాన్స్ఫర్ ఈజీగా ఉండాలి, ఫోన్ లో ఫీచర్స్ ఎక్కువగా కావాలి అనుకుంటే శామ్సంగ్ మొగ్గు చూపడం బెటర్.
ధర విషయానికి వస్తే, రెండు బ్రాండ్లు కూడా ప్రీమియం రేంజ్లో భారీ ధరలనే కలిగి ఉన్నాయి. ఐఫోన్ కి Resale Value ఎక్కువగా ఉంటుంది, అంటే మీరు రెండేళ్ల తర్వాత అమ్మినా మంచి రేటు వస్తుంది. కానీ శామ్సంగ్లో ఆఫర్లు, డిస్కౌంట్లు ఎక్కువగా దొరుకుతాయి.
చివరిగా.. మీరు సింప్లిసిటీ, ప్రీమియం లుక్ కోరుకుంటే ఐఫోన్ వైపు వెళ్ళండి. లేదు నాకు టెక్నాలజీ కావాలి, బెస్ట్ డిస్ప్లే కావాలి, కెమెరాలో ప్రయోగాలు చేయాలి అనుకుంటే శామ్సంగ్ తీసుకోండి.
