Health Tips :మన శరీరాన్ని, మనస్సును ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుకోవడానికి ఖరీదైన మందులు అవసరం లేదు, కేవలం కొన్ని మంచి అలవాట్లు చేసుకుంటే చాలు. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకుని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం చాలా మంచిది. దీనివల్ల మన శరీరంలో జీవక్రియలు వేగవంతమై, జీర్ణాశయం, ప్రేగులు, మూత్రపిండాలు శుభ్రపడతాయి.
అలాగే, ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు కనీసం ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మన నాడుల వ్యవస్థకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి మనల్ని రోజంతా ప్రశాంతంగా ఉంచుతుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కోసం ప్రతిరోజూ కొంతసేపు ఎండలో గడపడం ముఖ్యం.
ఉదయం పూట కనీసం అరగంట సేపు ఎండలో ఉండటం వల్ల మన శరీరానికి అవసరమైన డి-విటమిన్ అందుతుంది, దీనివల్ల ఎముకలు, కండరాలు, కీళ్లు బలంగా తయారవుతాయి. చదువుకునే అలవాటు ఉన్నవారికి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఒక పుస్తకం చదవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. దీనికి తోడు చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కదలికలు పెరిగి, బద్ధకం, అలసట తొలగిపోయి రోజంతా ఎంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది.
ఆహారపు అలవాట్లు కూడా మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి. రోజూ మనం తినే భోజనంలో తాజా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవడం వల్ల శరీరానికి సరైన పోషకాలు అంది, ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
నేటి కాలంలో స్మార్ట్ఫోన్ వాడకం ఎక్కువైనందున, ఉదయం లేవగానే మరియు రాత్రి పడుకునే ముందు ఫోన్కు దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల మనసుకి స్థైర్యం కలగడమే కాకుండా, కుటుంబ సభ్యులతో బంధాలు కూడా బలపడతాయి. చివరగా, మన మనసులో కలిగే ఆలోచనలను లేదా భావాలను ఒక పుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకుంటే, మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవచ్చు. పనులను చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు.
