Divya Kola : సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రధాన పాత్రలు చేసేవారే కాకుండా, చిన్న పాత్రల్లో మెరిసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే నటీమణులు ఎందరో ఉంటారు. వారిలో దివ్య కోల ఒకరు.
‘శతమానం భవతి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకున్న ఈమె బెవార్స్ మూవీలో లీడ్ రోల్ చేసింది. ప్రెషర్ కుక్కర్ లో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇవేకాకుండా విన్నర్, మజ్ను, ద్వారాక, పేపర్ బాయ్, నక్షత్రం, లై, బాబు బాగా బిజీ, అరవింద సమేత వంటి చిత్రాలలో నటించింది. కేవలం నటిగానే కాకుండా, దివ్య మంచి యాంకర్ కూడా. కెనాడాలో చాలా షోలు చేశారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో మాకి కిరికిర అనే సాంగ్ లో లీడ్ గా చేసింది.
వ్యక్తిగత జీవితానికి వస్తే, దివ్య పుట్టింది మహబుబూబాద్ లో .. హైదరాబాద్ లో పీహెచ్ డీ చేసింది. ఈమెకు నాగచైతన్యతో వివాహం జరగగా.. వీరికి ఒక అందమైన కూతురు కూడా ఉంది. ఆమె పేరు సైక్లా.. వైవాహిక జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. నిత్యం తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.


