US-Israel Strikes On Iran : ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య ఉన్న శత్రుత్వం దశాబ్దాల నాటిది. ఇది కేవలం దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు, ఆధిపత్యం, ఉనికి కోసం జరుగుతున్న పోరాటం. నిజానికి 1979కి ముందు ఇరాన్, ఇజ్రాయెల్ చాలా మంచి స్నేహ దేశాలు. కానీ 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం వచ్చిన తర్వాత అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఇరాన్ కొత్త పాలకులు ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించడానికి నిరాకరించారు. ఇజ్రాయెల్ ఒక అక్రమ దేశమని, దానిని భూమిపై నుంచి తుడిచివేయాలని ఇరాన్ పదే పదే ప్రకటిస్తూ ఉంటుంది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా తన ఉనికిని కాపాడుకోవడానికి ఇరాన్‌ను తన అతిపెద్ద శత్రువుగా పరిగణిస్తుంది.
శత్రుత్వానికి ప్రధాన కారణం ఇరాన్ అణు కార్యక్రమం. ఇరాన్ గనుక అణు బాంబును తయారు చేస్తే, అది నేరుగా ఇజ్రాయెల్‌పైనే ప్రయోగిస్తుందని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. అందుకే ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ తరచూ రహస్య దాడులు చేస్తూ, వారి అణు శాస్త్రవేత్తలను హతం చేస్తూ వస్తోంది. ఇది ఇరాన్‌కు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. వీటితో పాటు లెబనాన్, గాజా వంటి ప్రాంతాల్లోని సాయుధ గ్రూపులకు (హిజ్బుల్లా, హమాస్) ఇరాన్ మద్దతు ఇస్తూ ఇజ్రాయెల్‌పై దాడులు చేయిస్తుంటుంది. దీన్నే మనం పరోక్ష యుద్ధం అంటాం.
మరి అమెరికా ఎందుకు ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తోంది?
అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సంబంధం చాలా బలమైనది. మధ్యప్రాచ్యంలో అమెరికాకు ఇజ్రాయెల్ అత్యంత నమ్మకమైన స్నేహితుడు. అక్కడ అమెరికా ప్రయోజనాలను కాపాడటంలో ఇజ్రాయెల్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అధునాతన గూఢచారి వ్యవస్థ (మొసాద్) ఇచ్చే సమాచారం అమెరికాకు ఎంతో ముఖ్యం. అమెరికాలోని రాజకీయాల్లో కూడా ఇజ్రాయెల్ అనుకూల శక్తుల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తుంది.
మరోవైపు ఇరాన్ ఎప్పటినుంచో అమెరికాను మహా సాతాను (Great Satan) అని పిలుస్తూ వ్యతిరేకిస్తోంది. ఇరాన్ గనుక ఆ ప్రాంతంలో శక్తివంతంగా మారితే అమెరికా పట్టు తగ్గిపోతుంది. అందుకే ఇరాన్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి అమెరికా ఎప్పుడూ ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, ఆర్థిక సాయం అందిస్తూ వెనక ఉండి నడిపిస్తుంది. తాజా యుద్ధంలో కూడా ఇరాన్ అణు సామర్థ్యాన్ని, క్షిపణి వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో దాడులు చేశాయి.
Also Read :
- Ahmad Vahidi : రారా ట్రంప్ చూసుకుందాం…గట్టోడిని బరిలోకి దింపిన ఇరాన్!
- BIG BREAKING : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం… ట్రంప్ సంచలన ప్రకటన!
