Sobhita Dhulipala : ఇటీవల జరిగిన రెండు భారీ వేడుకల్లో అక్కినేని కోడలు శోభిత ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న (విరోష్) రిసెప్షన్, అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు నాగచైతన్య ఒక్కడే హాజరు కావడంతో అభిమానుల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. అల్లు శిరీష్ వేడుకకు చైతన్య తన తల్లిదండ్రులు నాగార్జున, అమలలతో కలిసి రాగా.. విరోష్ రిసెప్షన్‌లో కూడా శోభిత లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. శోభిత ప్రస్తుతం ఒక తమిళ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే ఈ వేడుకలకు రాలేకపోయిందని తెలుస్తోంది. షూటింగ్ షెడ్యూల్స్ కుదరకపోవడంతో ఆమె తన వృత్తిపరమైన బాధ్యతలకు ప్రాధాన్యతనిచ్చినట్లు సమాచారం. అలాగే, శోభిత మొదటి నుంచీ పెద్ద పెద్ద పార్టీల కంటే ప్రశాంతంగా ఉండేందుకే ఇష్టపడుతుంటారని, అందుకే ఈ హడావుడికి దూరంగా ఉన్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక మరోవైపు, శోభిత గర్భవతి అని అందుకే బయట కనిపించడం లేదనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో వీరి పెళ్లి జరిగినప్పటి నుంచి ఈ ప్రచారం సాగుతూనే ఉంది. ఇటీవల నాగార్జునను దీని గురించి అడగగా, “సరైన సమయం వచ్చినప్పుడు మేమే చెబుతాము” అని నవ్వుతూ దాటవేయడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే ప్రస్తుతానికి అక్కినేని కుటుంబం నుంచి కానీ, శోభిత నుంచి కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
