BIG BREAKING : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా హోంమంత్రి అనిత హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. సభలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఆమె నీరసించిపోయారు. వెంటనే స్పందించిన అసెంబ్లీ వైద్య బృందం ఆమెను పరీక్షించగా, రక్తపోటు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఒత్తిడి లేదా పని భారం వల్ల బీపీ పెరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. విశ్రాంతి తీసుకుంటే త్వరలోనే కోలుకుంటారని వైద్య బృందం వెల్లడించింది. హోంమంత్రి అస్వస్థత వార్త విన్న అభిమానులు, కార్యకర్తలు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. వైద్యులు ఆమెను పరీక్షించగా బీపీ 160 కి చేరుకున్నట్లు గుర్తించారు.
