IDBI Jobs : ఏడాదికి రూ.6.5 లక్షల ప్యాకేజీ.. IDBI బ్యాంక్‌లో సూపర్ ఛాన్స్, డిగ్రీ ఉంటే చాలు..!

idbi jobs

IDBI Jobs :  IDBI బ్యాంక్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమా కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 19వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్తె, లంగాణలో కలిపి 65 ఖాళీలు ఉండటం విశేషం.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు అంటే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వయస్సు విషయానికి వస్తే 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు కాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు కూడా వర్తిస్తాయి. ఎంపికైన వారికి ఏడాదికి రూ. 6.14 లక్షల నుండి రూ. 6.50 లక్షల వరకు ఆకర్షణీయమైన జీతభత్యాలు లభిస్తాయి.

ఎంపిక ప్రక్రియ మొత్తం నాలుగు దశల్లో సాగనుంది. మొదట ఏప్రిల్ 12న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ , చివరగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుముగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 1,050 చెల్లించాల్సి ఉండగా మిగిలిన వారు రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశమని నిపుణులు చెబుతున్నారు.

Advertisement-Grade-O-2-year-exp-March072026