pm kisan : కోట్లాది మంది రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి22వ విడత డబ్బుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. కేంద్ర ప్రభుత్వం ఈ విడత నిధులను మార్చి నెలలోనే విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో లబ్ధిదారులైన రైతుల నిరీక్షణకు తెరపడనుంది.
మార్చి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని కోక్రాఝర్ పర్యటనలో భాగంగా ఒకే క్లిక్‌తో దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేల చొప్పున జమ చేయనున్నారు. గత కొంతకాలంగా ఈ నిధులు ఫిబ్రవరి చివరలో వస్తాయని, హోలీ పండుగ కంటే ముందే వస్తాయని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా మార్చి 13వ తేదీని ఖరారు చేస్తూ స్పష్టత ఇచ్చింది.
