Post Office : చాలామంది తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడైనా సురక్షితమైన చోట దాచుకోవాలని, దాని నుంచి మంచి లాభం రావాలని కోరుకుంటారు. అలాంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ‘మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్’ (MIS) ఒక అద్భుతమైన అవకాశం. ఈ పథకంలో మీరు ఒకేసారి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే, దానిపై వచ్చే వడ్డీని ప్రతి నెలా ఆదాయం రూపంలో పొందవచ్చు.
ఇది ప్రభుత్వానికి సంబంధించిన పథకం కాబట్టి మీ డబ్బుకు పూర్తి భరోసా ఉంటుంది. ముఖ్యంగా రిటైర్ అయిన వారు, గృహిణులు మరియు రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఈ సేమిపు పథకం ఎంతో మేలు చేస్తుంది. ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది. మీరు డబ్బులు డిపాజిట్ చేసిన మరుసటి నెల నుంచే మీకు వడ్డీ డబ్బులు రావడం మొదలవుతుంది. ప్రస్తుతం ఈ పథకానికి ఏటా 7.4 శాతం వడ్డీ ఇస్తున్నారు, ఇది చాలా బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగ్గా ఉండటం విశేషం.
ఈ పథకం ద్వారా నెలకు రూ. 5,550 వరకు ఎలా సంపాదించవచ్చో ఒకసారి చూద్దాం. ఉదాహరణకు మీరు ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే, నెలకు దాదాపు 600 రూపాయల వరకు వడ్డీ వస్తుంది. అదే మీరు ఐదు లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడితే, ప్రతి నెలా మీకు 3,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం అందుతుంది. ఒకవేళ మీరు ఈ పథకంలో ఉన్న గరిష్ట పరిమితి అంటే 9 లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తే, ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం నెలకు సుమారు 5,550 రూపాయలను సంపాదించవచ్చు.
కేవలం వెయ్యి రూపాయలతో కూడా ఈ ఖాతాను ప్రారంభించే వెసులుబాటు ఉంది. వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా 9 లక్షల వరకు, అదే ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ తీసుకుంటే 15 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఐదేళ్ల తర్వాత మీ అసలు డబ్బును వెనక్కి తీసుకోవచ్చు లేదా కావాలంటే మళ్ళీ పెట్టుబడిగా పెట్టుకోవచ్చు.
సురక్షితమైన పెట్టుబడితో పాటు ఇంటి ఖర్చుల కోసం నెలనెలా కొంత డబ్బు చేతికి రావాలని ఆశించేవారికి పోస్ట్ ఆఫీస్ MIS పథకం ఒక చక్కటి మార్గం. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి నష్టం వాటిల్లే భయం లేకుండా ప్రభుత్వం ఇచ్చే ఈ అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకోవచ్చు. పెట్టుబడి పెట్టిన అసలు ఎక్కడికీ పోకుండా ఉండటంతో పాటు, లాభం కూడా స్థిరంగా రావడం ఈ పథకంలోని అతి పెద్ద ప్లస్ పాయింట్.
