BIG BREAKING : ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వాని తన భర్త సోహైల్ ఖతూరియా నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ముంబైలోని కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే, విడాకుల సమయంలో హన్సిక తన భర్త నుంచి ఎలాంటి డబ్బులు ఆశించలేదు. ఇద్దరూ ఇష్టపూర్వకంగానే విడిపోవాలని కోర్టుకు చెప్పారు.
వీరిద్దరికీ 2022 డిసెంబర్లో రాజస్థాన్లోని జైపూర్లో ఘనంగా పెళ్లి జరిగింది. కానీ, పెళ్లయిన కొద్దిరోజులకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరి ఆలోచనలు మరొకరికి నచ్చకపోవడం, చిన్న చిన్న విషయాలకే గొడవ పడటంతో కలిసి ఉండటం కష్టమని భావించారు. పెద్దలు, స్నేహితులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు.
దాంతో 2024 జూలై నుంచి విడివిడిగా ఉంటున్న వీరు, ఇప్పుడు అధికారికంగా విడాకులు తీసుకుని తమ బంధానికి ముగింపు పలికారు. హన్సిక చిన్నప్పటి నుంచి నటిగా చేస్తూ తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
